Twitter Deal : ట్విట్టర్ డీల్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్

స్వామ్, ఫేక్ అకౌంట్ల విషయంలో వివరాలు పెండింగ్ లో ఉన్నాయని.. అందుకే ఆ డీల్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. మస్క్ ప్రకటనతో ప్రీమార్కెట్ ట్రేడింగ్ లో ట్విట్టర్ షేర్లు 20 శాతం పడిపోయాయి.

Twitter Deal : ట్విట్టర్ డీల్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్

Twitter

Elon Musk : సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ను కొనుగోలు చేయనున్నట్లు బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ట్విట్టర్ డీల్ తాత్కాలికంగా వాయిదా పడింది. ట్విట్టర్ డీల్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీనికి సంబంధించిన విషయాన్ని ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ లో తెలిపారు. స్వామ్, ఫేక్ అకౌంట్లు లెక్క తేల్చాలని మస్క్ అంటున్నారు. స్వామ్, ఫేక్ అకౌంట్లు 5శాతం లోపేనని ట్విట్టర్ అంటోంది.

44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను కొనేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నం చేశారు. స్వామ్, ఫేక్ అకౌంట్ల విషయంలో వివరాలు పెండింగ్ లో ఉన్నాయని.. అందుకే ఆ డీల్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. మస్క్ ప్రకటనతో ప్రీమార్కెట్ ట్రేడింగ్ లో ట్విట్టర్ షేర్లు 20 శాతం పడిపోయాయి.

Elon Musk : ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్‌.. ఎంతకో తెలుసా?
దీనిపై వెంటనే స్పందించేందుకు ట్విట్టర్ సంస్థ నిరాకరించింది. తమ అకౌంట్ల యూజర్లలో కేవలం 5 శాతం మాత్రమే ఫేక్ లేదా స్పామ్ అకౌంట్లు ఉన్నట్లు గతంలో ట్విట్టర్ తెలిపింది. కాగా, ఇవాళ ఇద్దరు సీనియర్ ఎగ్టిక్యూటివ్ లను తొలగిస్తూ ట్విట్టర్ నిర్ణయం తీసుకుంది.