Elon musk: ఎలన్ మస్క్‌కు షాక్.. డీల్ ఆపాలంటూ కోర్టుకెళ్లిన ట్విట్టర్ వాటాదారు

ఎలన్ మస్క్‌కు ట్విటర్ కొనుగోలు వ్యవహారంలో కొత్తచిక్కు ఎదురైంది. మస్క్ డీల్‌ను వ్యతిరేకిస్తూ ట్విటర్ వాటారు అయిన ప్లోరిడా పెన్షన్ ఫండ్ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. మూడేళ్ల పాటు డీల్‌ను నిలిపివేయాలంటూ..

Elon musk: ఎలన్ మస్క్‌కు షాక్.. డీల్ ఆపాలంటూ కోర్టుకెళ్లిన ట్విట్టర్ వాటాదారు

Alon Musk

Elon musk: ఎలన్ మస్క్‌కు ట్విటర్ కొనుగోలు వ్యవహారంలో కొత్తచిక్కు ఎదురైంది. మస్క్ డీల్‌ను వ్యతిరేకిస్తూ ట్విటర్ వాటారు అయిన ప్లోరిడా పెన్షన్ ఫండ్ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. మూడేళ్ల పాటు డీల్‌ను నిలిపివేయాలంటూ ఆమె న్యాయస్థానాన్ని కోరింది. కొద్దిరోజుల క్రితం ఎలన్ మస్క్ 44బిలియన్ డాలర్ల భారీ మొత్తంలో ట్విటర్ ను సొంతం చేసుకొనేందుకు డీల్ కుదుర్చుకున్నారు. త్వరలో ట్విటర్‌ను టేకోవర్ చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో మస్క్ ట్విటర్‌లో నెటిజన్లతో ఇన్‌ట్రాక్ట్ అవుతూ రోజుకో కొత్త విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఇక సీఈవో వ్యవహారంపైనా చర్చ జరుగుతుంది. ప్రస్తుత సీఈవో అగర్వాల్‌ను తప్పించి తానే సీఈవోగా వ్యవహరించేందుకు మస్క్ సిద్ధమైనట్లు వార్తలొచ్చాయి. అంతా పూర్తవుతుందనుకుంటున్న క్రమంలో మస్క్‌కు కొత్త సమస్య ఎదురైంది.

నాకు ఫీలింగ్స్ ఉన్నాయి.. నేనేం రోబోను కాను!

2025లోపు ట్విటర్‌ను ఎలన్ మస్క్ కొనుగోలు చేయకుండా అడ్డుకోవాలంటూ డెలావేర్ చాన్సెరీ కోర్టులో (యూఎస్) పిటీషన్ దాఖలైంది. అంతేకాదు ట్విటర్ విలీనాన్ని వెంటనే అడ్డుకోవాలని పిటిషనర్ కోరింది. ట్విటర్‌లో ఇతర పెద్ద వాటాదారులతో మస్క్ ఒప్పందం కుదుర్చుకున్నారని, ట్విటర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సేతో పాటు, తనకు, ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న మోర్గాన్ స్టాన్లే కూడా ఇందులో ఉన్నట్లు ఫ్లోరిడా పెన్షన్ ఫండ్ కోర్టుకు తెలిపింది. మోర్గాన్ స్టాన్లేకి 8.8శాతం వాటా, జాక్ డోర్సేకి 2.4శాతం వాటా ఉందని ఫ్లోరిడా ఫెన్షన్ ఫండ్ పేర్కొంది. చట్టప్రకారం ఎలన్ మస్క్ 9.6శాతం వాటా కాకుండా ఇతర షేర్లలో మూడింట రెండొంతులు ఆమోదం లభించేంత వరకు మూడేళ్ల పాటు డీల్ ను నిలిపివేయాలని ప్లోరిడా పెన్షన్ ఫండ్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. మరి కొత్తగా ఎదురైన న్యాయపరమైన చిక్కును ఎలన్ మస్క్ ఎలా ఎదుర్కొంటారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.