Mutiny in Russia: రష్యాలో కిరాయి సైన్యం తిరుగుబాటు..మాస్కోలో హైఅలర్ట్

రష్యా దేశంలో శక్తివంతమైన కిరాయి గుంపు వాగ్నర్ శనివారం సాయుధ తిరుగుబాటుకు పాల్పడింది.రోస్టోవ్‌లోని సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ భవనాన్ని వాగ్నర్ కిరాయి సైన్య దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.ఈ తిరుగుబాటుతో మాస్కోలోని భద్రతా దళాలు హైఅలర్ట్ ప్రకటించాయి....

Mutiny in Russia: రష్యాలో కిరాయి సైన్యం తిరుగుబాటు..మాస్కోలో హైఅలర్ట్

Mutiny in Russia

Mutiny in Russia: రష్యా దేశంలో శక్తివంతమైన కిరాయి గుంపు వాగ్నర్ శనివారం సాయుధ తిరుగుబాటుకు పాల్పడింది. రోస్టోవ్‌లోని సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ భవనాన్ని వాగ్నర్ కిరాయి సైన్య దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ తిరుగుబాటుతో మాస్కోలోని భద్రతా దళాలు హైఅలర్ట్ ప్రకటించాయి.(Moscow on high alert) క్రెమ్లిన్ రష్యన్ కిరాయి సైన్యం బాస్ యెవ్జెనీ ప్రిగోజిన్ సాయుధ తిరుగుబాటుకు పాల్పడ్డారు. (Wagner takes control of military building in Rostov) మాస్కో అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.

US President Joe Biden gifts : మోదీకి జో బిడెన్ టీషర్ట్ బహుమతి

వాగ్నర్ దళాలు రోస్టోవ్‌లోని సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ భవనంపై నియంత్రణ సాధించాయి. తన బలగాలు దక్షిణ సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించాయని వాగ్నర్ గ్రూప్ చీఫ్ చెప్పడంతో రోస్టోవ్‌లోని రష్యన్ అధికారులు నివాసితులను ఇంట్లోనే ఉండాలని కోరారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల కారణంగా దయచేసి సిటీ సెంటర్‌కు వెళ్లడం మానుకోండి వీలైతే, మీ ఇళ్లను వదిలి వెళ్లవద్దు’’ అని రోస్టోవ్ ప్రాంత గవర్నర్ సలహా ఇచ్చారు.

US Intelligence Report : కొవిడ్ వ్యాప్తిపై యూఎస్ ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక

మరోవైపు, భద్రతను పటిష్ఠం చేసేందుకు ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకుంటున్నామని మాస్కో మేయర్ చెప్పారు. ‘‘మేమందరం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని యవ్జెనీ ప్రిగోజిన్ ఆడియో సందేశంలో తెలిపారు. తాము రష్యన్ ప్రజల కోసం చనిపోతున్నామని యవ్జెనీ ప్రిగోజిన్ పేర్కొన్నారు.