చరిత్రలో ఫస్ట్ టైమ్ : అంతరిక్షంలో నేరం జరిగింది

నేరం ఎక్కడ జరిగితే విచారణ అక్కడే చేయాలనేది రూల్... అయితే ఇప్పుడు అమెరికాలో ఓ విచిత్రమైన కేస్ వచ్చింది. నేరం జరిగిన చోట ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ జరిపే అవకాశం

  • Published By: veegamteam ,Published On : August 25, 2019 / 05:38 AM IST
చరిత్రలో ఫస్ట్ టైమ్ : అంతరిక్షంలో నేరం జరిగింది

నేరం ఎక్కడ జరిగితే విచారణ అక్కడే చేయాలనేది రూల్… అయితే ఇప్పుడు అమెరికాలో ఓ విచిత్రమైన కేస్ వచ్చింది. నేరం జరిగిన చోట ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ జరిపే అవకాశం

నేరం ఎక్కడ జరిగితే విచారణ అక్కడే చేయాలనేది రూల్… అయితే ఇప్పుడు అమెరికాలో ఓ విచిత్రమైన కేస్ వచ్చింది. నేరం జరిగిన చోట ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ జరిపే అవకాశం లేదు. ఎందుకంటే తప్పు జరిగింది అంతరిక్షంలో… అవును నిజమే. ఓ వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తప్పు చేసింది. దీనిపై ఇప్పుడు నాసా విచారణ మొదలుపెట్టింది. అంతరిక్ష కేంద్రం నుంచి తన మాజీ భర్త బ్యాంకు ఖాతాను యాక్సెస్‌ చేసింది ఓ వ్యోమగామి. దీనిపై నాసా విచారణ ప్రారంభించింది. అంతరిక్షంలో చేసిన నేరానికి భూమ్మీద విచారణ చేపట్టిన మొదట సంఘటన బహుశా ఇదే కావొచ్చు!

అన్‌ మెక్‌క్లెయిన్‌ నాసాలో వ్యోమగామి. అంతరిక్ష కేంద్రంలో కొన్నాళ్లు పరిశోధన చేసింది. అక్కడి నుంచే తన మాజీ భర్త సమ్మర్‌ వోర్డెన్‌ బ్యాంకు ఖాతాను ఒకసారి యాక్సెస్‌ చేసిందట. నాసా అఫ్లియేటెడ్‌ కంప్యూటర్‌ నుంచి మెక్‌క్లెయిన్ ఈ పని చేసిందట. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు నాసా అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో నాసా విచారణ చేపట్టింది. అయితే తాను ఏ తప్పూ చేయలేదంటోంది మెక్‌ క్లెయిన్‌… విడిపోవడానికి ముందునుంచే బాబును పెంచుకుంటున్నామని…కొడుకును చూసుకోవడానికి సరిపడా డబ్బులున్నాయా లేదా అన్నది పరిశీలించడానికే అలా చేశానంటోంది. మెక్‌ క్లెయిన్ 2018లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొన్ని రోజులు గడిపింది.

Also Read : మనుషులేనా : విరిగిన కాళ్లనే తలగడగా పెట్టారు