మనుషులేనా : విరిగిన కాళ్లనే తలగడగా పెట్టారు

హర్యానాలోని ఫరీదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రి సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించింది. విరిగిన కాళ్లనే పేషెంట్ కి తలగడగా పెట్టారు. వివరాల్లోకి వెళితే..

  • Published By: veegamteam ,Published On : August 25, 2019 / 02:49 AM IST
మనుషులేనా : విరిగిన కాళ్లనే తలగడగా పెట్టారు

హర్యానాలోని ఫరీదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రి సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించింది. విరిగిన కాళ్లనే పేషెంట్ కి తలగడగా పెట్టారు. వివరాల్లోకి వెళితే..

హర్యానాలోని ఫరీదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. పేషెంట్ పట్ల ఆసుపత్రి సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించింది. విరిగిన కాళ్లనే పేషెంట్ కి తలగడగా పెట్టారు స్టాఫ్. వివరాల్లోకి వెళితే.. రైలు ప్రమాదంలో ప్రదీప్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతను రెండు కాళ్లు కోల్పోయాడు. చికిత్స కోసం ప్రదీప్ ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రి సిబ్బంది అతడి పట్ల కనీస మానవత్వం కూడా చూపలేదు. పైగా అమానుషంగా ప్రవర్తించారు. ప్రదీప్ బాధతో విలవిలలాడుతుంటే.. జాలిగుండె లేని సిబ్బంది విరిగిన కాళ్లనే అతనికి తలగడలా పెట్టారు. ప్రదీప్‌ ఫరీదాబాద్‌లో ఓ ప్రైవేట్ ఉద్యోగి. ఇంటి నుంచి ఆఫీస్ కి వెళుతూ.. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న రైలు అతన్ని ఢీకొట్టింది. 

ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంత దారుణమా అని నెటిజన్లు తిడుతున్నారు. మీరసలు మనుషులేనా, మానవత్వం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే అతడు బాధతో విలవిలలాడుతుంటే.. అతడి కాళ్లను తలగడగా పెట్టడం ఘోరం అంటున్నారు. అమానుషంగా ప్రవర్తించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారిని విధుల నుంచి తొలగించాలన్నారు.

అసలే ప్రభుత్వ ఆసుపత్రులకు మంచి పేరు లేదు. కనీస సౌకర్యాలు ఉండవు, డాక్టర్లు ఉండరు, వైద్య సేవలు చెయ్యరు, మందులు ఉండవు అనే అభిప్రాయం ఉంది. ఇవి చాలవన్నట్టు.. ఇలాంటి ఘోరాలు, దారుణాలు. ఇవన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల ప్రతిష్టను మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. సర్కారీ దవాఖానా అంటేనే వామ్మో అంటున్నారు.

Also Read : మరోసారి ఉలిక్కిపడిన అమెరికా : భయాందోళనలో ప్రజలు