మరోసారి ఉలిక్కిపడిన అమెరికా : భయాందోళనలో ప్రజలు

అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. అమెరికాలో కాల్పులు జరిగాయి. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలిక

  • Published By: veegamteam ,Published On : August 25, 2019 / 02:27 AM IST
మరోసారి ఉలిక్కిపడిన అమెరికా : భయాందోళనలో ప్రజలు

అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. అమెరికాలో కాల్పులు జరిగాయి. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలిక

అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. అమెరికాలో కాల్పులు జరిగాయి. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం(ఆగస్టు 23,2019) రాత్రి దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలిక మృతిచెందింది. మరో ముగ్గురు గాయపడ్డారు. సెయింట్‌ లూయిస్‌ నగరంలోని సోల్డన్‌ హైస్కూల్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. బాలిక తన కుటుంబంతో కలిసి పుట్‌బాల్‌ ఈవెంట్‌కు హాజరైంది. ఆ సమయంలో దుండగుడు ఒక్కసారిగా కాల్పులుకు తెగబడ్డాడు. కాల్పుల్లో బాలికతో పాటు ఇద్దరు టీనేజర్లు, 40 ఏళ్ల మహిళ గాయపడ్డారు. ఏప్రిల్‌ నుంచి సెయింట్ లూయిస్ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇప్పటివరకు ఈ బాలికతో కలిపి 12 మంది చనిపోయారు. బాలిక మృతితో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కళ్ల ముందే కన్నకూతురు చనిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోల్డన్ హైస్కూల్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ సెక్యూరిటీని టైట్ చేశారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితుడికి సంబంధించిన ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు.

అమెరికాలో గన్ కల్చర్ ఆందోళనకు గురి చేస్తోంది. తరుచుగా ఫైరింగ్ ఘటనలు జరుగుతున్నాయి. దుండగులు గన్ తో పిట్టలను కాల్చినట్టు ప్రజలను కాల్చేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. భద్రతపై టెన్షన్ పడుతున్నారు. ఎంత సెక్యూరిటీ ఉంటున్నా.. ప్రమాదాలను అరికట్టలేకపోతున్నారు. అమెరికాలో గన్ లైసెన్స్ ఈజీగా వచ్చేస్తుంది. షాపులో పిల్లలు చాక్లెట్లు కొనుకున్నంత సులభంగా అక్కడ గన్లు కొనొచ్చు. ఈ పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. కొంత మంది ఉన్మాదులుగా మారి జనాలపై గన్ తో విరుచుకుపడుతున్నారు. అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారు.

Also Read : మనుషులేనా : విరిగిన కాళ్లనే తలగడగా పెట్టారు