16 నెలల తర్వాత : లండన్‌లో నీరవ్ మోడీ ఆచూకీ లభ్యం

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 03:12 AM IST
16 నెలల తర్వాత : లండన్‌లో నీరవ్ మోడీ ఆచూకీ లభ్యం

భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి తప్పించుకుని తిరుగుతున్న ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. 16 నెలల తర్వాత మోడీ  ఆచూకీ దొరికింది. లండన్ లో టెలిగ్రాఫ్ పత్రికకు నీరవ్ మోడీ దృశ్యాలు చిక్కాయి. లండన్‌లో మోడీ స్వేచ్చగా తిరుగుతున్నాడు. వజ్రాల వ్యాపారమే చేసుకుంటూ విలాసవంతమైన జీవితం  గడుపుతున్నాడు. 2018 జులైలో నీరవ్ మోడీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. నీరవ్ మోడీ భారత బ్యాంకులకు రూ.13వేల 700 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడ్డాడు.
Read Also : 22 ఉగ్రవాద శిబిరాలు నడుస్తున్నాయి: పాక్ బండారం బట్టబయలు

ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంకుని భారీ మోసం చేశాడు. నీరవ్ మోడీ ఆచూకీ కోసం భారత ప్రభుత్వం తెగ వెదికింది. అమెరికా, చైనా, హాంగ్ కాంగ్ లో నీరవ్ ను గుర్తించామని, ఆయా  ప్రాంతాల్లో మోడీ పాస్ పోర్టు ఎన్ రోల్ అయ్యి ఉందని కేంద్ర ప్రభుత్వ చెప్పింది. చివరకు లండన్‌లో నీరవ్ మోడీ ఆచూకీ లభ్యమైంది. లండన్ లోని వెస్ట్ ఎండ్ లో 8 మిలియన్ పౌండ్ల భవనంలో  విలాసవంతమైన జీవితాన్ని మోడీ గడుపుతున్నాడు.

ఇటీవలే నీరవ్ మోడీ ఎంతో ఇష్టంగా కట్టుకున్న మహారాష్ట్ర అలీబాగ్‌లోని బంగ్లాను రాయగడ్ జిల్లా కలెక్టర్ సమక్షంలో అధికారులు నేలమట్టం చేశారు. 100 డైనమైట్లతో బంగ్లాను పడగొట్టారు. భవనానికి రంధ్రాలు చేసి డైనమైట్ అమర్చి పేల్చేశారు. నీరవ్ మోడీ ఈ బంగ్లాను 33 వేల చదరపు అడుగుల స్థలంలో నిర్మించారు. దీని విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుంది. తీరప్రాంత రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించి బంగ్లాను నిర్మించుకోవడంతో ఈ అత్యంత విలాసవంతమైన బంగ్లాను అధికారులు తేల్చారు. ఒక్క బంగ్లానే కాదు… బంగ్లా బయట ఉన్న తోటను కూడా ధ్వంసం చేశారు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను మోసగించిన కేసులో నీరవ్‌ కి చెందిన రూ.147.72 కోట్ల ఆస్తులను మనీ లాండరింగ్‌ చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు జప్తు చేశారు. 8 కార్లు, ఆభరణాలతో పాటు పలు విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకు న్నారు. ఎంఎఫ్‌ హుస్సేన్‌, అమృత షెర్‌-గిల్‌ తదితర ప్రముఖ చిత్రకారులకు చెందిన రూ. 50 కోట్ల విలువైన పెయింటింగ్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మోడీ గ్రూప్స్‌కు చెందిన ఫైవ్‌స్టార్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఖాతాదారులు చెల్లించాల్సిన నగదు, స్థిరాస్తులను స్వాధీనం చేసుకుంది. పలు దేశాలలో నీరవ్‌ మోడీకి చెందిన రూ.1,725.36 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటి వరకు ఈడీ అధికారులు సీజ్ చేశారు.

Read Also : ఇమ్రాన్ మాటలేనా: ఉగ్రవాదంపై.. నయా పాక్.. నయా యాక్షన్ చూపించు