Mark Zuckerberg: నియామకాలు లేవు, త్వరలో మరిన్ని తొలగింపులు.. ఉద్యోగులకు షాకిచ్చిన మార్క్ జూకర్‌బర్గ్.. ఎందుకంటే..

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ప్రస్తుతం ఆర్థిక మాంద్యం మధ్య ఖర్చులను తగ్గించుకొనేందుకు ఉద్యోగులను తగ్గించుకొనే ప్రయత్నంలో ఉంది. రాబోయే నెలల్లో ఖర్చులను కనీసం 10శాతం తగ్గించుకోవాలని మెటా యోచిస్తోంది.

Mark Zuckerberg: నియామకాలు లేవు, త్వరలో మరిన్ని తొలగింపులు.. ఉద్యోగులకు షాకిచ్చిన మార్క్ జూకర్‌బర్గ్.. ఎందుకంటే..

Mark Zuckerberg

Mark Zuckerberg to employees: ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ప్రస్తుతం ఆర్థిక మాంద్యం మధ్య ఖర్చులను తగ్గించుకొనేందుకు ఉద్యోగులను తగ్గించుకొనే ప్రయత్నంలో ఉంది. రాబోయే నెలల్లో ఖర్చులను కనీసం 10శాతం తగ్గించుకోవాలని మెటా యోచిస్తోంది. ఇదే విషయాన్ని మెటా వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు వెల్లడించారు. ఉద్యోగులతో అంతర్గత కాల్ సందర్భంగా జుకర్ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Football Match In Indonesia: ఇండోనేషియాలో ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 127 మంది మృతి, మరో 180 మందికి గాయాలు

వచ్చే ఏడాది హెడ్‌కౌంట్ వృద్ధిని క్రమంగా తగ్గించడమే మా ప్రణాళిక అని, ఈ క్రమంలో నూతన నియామకాలను నిలిపివేయడంతో పాటు, ఉద్యోగుల సంఖ్యను కుందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపాడు. మే నెలలో జుకర్‌బర్గ్ మెటాలోని కొన్ని విభాగాల్లో హైరింగ్ ఫ్రీజ్‌ను ప్రకటించారు. అయితే, అతను ఇప్పుడు డిపార్ట్‌మెంట్‌లు, నియామకాల ఫ్రీజ్‌ను విస్తరించాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

Facebook యొక్క మాతృ సంస్థ Meta ప్రస్తుతం ఆర్థిక మాంద్యం మధ్య రాబోయే నెలల్లో ఖర్చులను కనీసం 10% తగ్గించుకోవాలని యోచిస్తోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం ముగిసే సమయానికి మార్క్ జుకర్‌బర్గ్ ఆధ్వర్యంలోని కంపెనీలో 83,553 మంది ఉద్యోగులు ఉన్నారు. బిగ్ టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించి, కొత్త నియామకాలను స్తంభింపజేస్తున్నందున, వచ్చే ఏడాదిలో హెడ్‌కౌంట్ వృద్ధిని క్రమంగా తగ్గించడమే కంపెనీ ప్రణాళిక అని జుకర్‌బర్గ్ జూలైలో చెప్పారు.