Football Match In Indonesia: ఇండోనేషియాలో ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 127 మంది మృతి, మరో 180 మందికి గాయాలు

ఇండోనేషియాలోని తూర్పు జావాలో ఫుట్‌బాల్ మ్యాచ్ తరువాత గ్రౌండ్‌లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 127 మరణించగా, 180 మందికిగాపైగా గాయపడినట్లు ఇండోనేషియా పోలీసులు తెలిపారు.

Football Match In Indonesia: ఇండోనేషియాలో ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 127 మంది మృతి, మరో 180 మందికి గాయాలు

Indonesia

Football Match In Indonesia: ఇండోనేషియాలోని తూర్పు జావాలో ఫుట్‌బాల్ మ్యాచ్ తరువాత గ్రౌండ్‌లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 127 మరణించగా, 180 మందికిగాపైగా గాయపడినట్లు ఇండోనేషియా పోలీసులు తెలిపారు. తూర్పు జావాలోని మలాంగ్ రీజెన్సీలోని కంజురుహాన్ స్టేడియంలో శనివారం రాత్రి అరెమా – పెర్సెబయా మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

Asia Cup Women : మహిళల ఆసియా కప్‌.. శ్రీలంకపై భారత్ ఘన విజయం

అరెమా – పెర్సెబయా సురబాయ జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించేందుకు భారీ సంఖ్యలో ఇరు జట్ల అభిమానులు గ్రౌండ్ కు వచ్చారు. ఈ మ్యాచ్ లో అరెమా జట్టు ఓడిపోయింది. దీంతో వేలాది మంది అరెమా జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకు రావడంతో ఘర్షణకు దారితీసింది. అరెమా జట్టుకు చెందిన మద్దతుదారులు పిచ్‌పైకి దూసుకొచ్చారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవటంతో.. టియర్ గ్యాస్ ప్రయోగించవలసి వచ్చింది. భారీగా ఇరుజట్ల అభిమానులు గ్రౌండ్ లోకి దూసుకురావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మరోవైపు టియర్ గ్యాస్ కారణంగా గాలిలో ఆక్సిజన్ అందక 127 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 180 మంది తీవ్ర అస్వస్థత, గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ ఘటనలో మరణించిన వారిలో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. 34మంది స్టేడియంలో మరణించగా, మిగిలినవారు ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో, మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో స్టేడియంలోని పిచ్‌పైకి క్రీడాభిమానులు దూసుకెళ్తున్నట్లు కనిపించింది. ఈ ఘటనపై ఇండోనేషియా ఫుట్‌బాల్ అసోసియేషన్ (PSSI) విచారం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆట తర్వాత ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు ప్రారంభించడానికి ఒక బృందం మలాంగ్‌కు బయలుదేరిందని తెలిపింది.

కంజురుహాన్ స్టేడియంలో అరెమా మద్దతుదారుల చర్యలకు ఇండోనేషియా ఫుట్‌బాల్ అసోసియేషన్ విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనతో లీగ్ గేమ్‌లను ఒక వారం పాటు నిలిపివేసింది. అరెమా పీసీ జట్టు ఈ సీజన్‌లో మిగిలిన పోటీలకు ఆతిథ్యం ఇవ్వకుండా నిషేధించినట్లు పీఎస్‌ఎస్‌ఐ ఛైర్మన్ తెలిపారు.