చంద్రుడిపై 4G నెట్ వర్క్.. NASAతో Nokia డీల్..!

  • Edited By: sreehari , October 18, 2020 / 07:44 PM IST
చంద్రుడిపై 4G నెట్ వర్క్..  NASAతో Nokia డీల్..!

4G network on the moon : చందమామపై 4G నెట్ వర్క్ రాబోతోంది. ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో ప్రముఖ మొబైల్‌ దిగ్గజం నోకియా సంస్థ డీల్ కుదుర్చుకుంది. చంద్రునిపై 4G సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. 2028 నాటికి వ్యోమగాములు చంద్రునిపై పనులు ప్రారంభించడానికి నాసా ఇప్పటికే ప్రయోగాలు చేపట్టింది.ఇందుకోసం నాసా నోకియా ఆఫ్ అమెరికాతో కాంట్రాక్ట్ కుదిరింది. చంద్రునిపై సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు చేపట్టింది. నోకియా చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ కోసం 14.1 మిలియన్ డాలర్ల నిధులు అందించనున్నట్లు నాసా ప్రకటించింది.

టిప్పింగ్ పాయింట్ ఎంపికల కింద 370 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసింది. అంతరిక్ష పరిశోధన, అభివృద్ధి దిశగా కొనసాగేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది.నోకియా ప్లాన్ ప్రకారం.. 4G / LTE నెట్‌వర్క్‌ను నిర్మించడంతో పాటు చివరికి 5G నెట్ వర్క్‌కు మార్చాలనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. నాసా ప్రకటన ప్రకారం.. అంతరిక్షంలో మొదటి LTE/4G కమ్యూనికేషన్ వ్యవస్థ కానుంది.

ఈ వ్యవస్థ చంద్ర ఉపరితల సమాచార మార్పిడికి ఎక్కువ దూరం, పెరిగిన వేగంతో పాటు ప్రస్తుత ప్రమాణాల కంటే ఎక్కువ విశ్వసనీయతను అందించగలదని నాసా ప్రకటనలో పేర్కొంది.నోకియా పరిశోధక విభాగం Bell Labs అందించిన వివరాల ప్రకారం.. చంద్ర రోవర్లు, నావిగేషన్ వైర్‌లెస్ ఆపరేషన్‌తో పాటు వీడియోను ప్రసారం చేయడానికి నెట్‌వర్క్‌ను తీసుకోస్తోంది. ఈ నెట్‌వర్క్ కాంపాక్ట్‌ను సమర్థవంతంగా నిర్మించారు. అలాగే అంతరిక్షంలో విపరీతమైన ఉష్ణోగ్రత, రేడియేషన్, వాక్యూమ్ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు. 2028 నాటికి చంద్రునిపై స్థావరం ఏర్పాటు చేసుకోవాలన్నది నాసా లక్ష్యమని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టైన్ తెలిపారు.అంతరిక్షంలో రాకెట్ ప్రొపెల్లెంట్‌ను తయారు చేయడానికి సాంకేతికత కోసం దాదాపు 370 మిలియన్‌ డాలర్ల ఖర్చు అవుతుంది. ఈ సాంకేతికను అందించే స్పేస్‌ఎక్స్, యునైటెడ్ లాంచ్ అలయన్స్ వంటి అంతరిక్ష సంస్థలకు నాసా అందిస్తోంది. చంద్రునిపై కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ను నిర్మిస్తే అక్కడికి వెళ్లే వ్యోమగాములు మొబైల్‌ ఫోన్‌లను వినియోగించుకోవచ్చు.