North Korea: మరిన్ని అణ్వాయధ క్షిపణులు తయారు చేయండి.. అధికారులను ఆదేశించిన కిమ్

త్వరలో మరిన్ని అణ్వాయుధ క్షిపణుల్ని తయారు చేయాలని తన పార్టీ నేతలు, అధికారులకు సూచించారు. ఇటీవల కిమ్ తన వర్కర్స్ పార్టీ నేతలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా ఆయుధ సామర్ధ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

North Korea: మరిన్ని అణ్వాయధ క్షిపణులు తయారు చేయండి.. అధికారులను ఆదేశించిన కిమ్

North Korea: ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్ తన దుందుడుకు చర్యలు మానడం లేదు. ఇప్పటికే పలు ప్రమాదకర ఆయుధాల తయారీతో అమెరికాసహా పలు దేశాల్ని వణికిస్తున్న కిమ్ ఇప్పుడు మరింత దూకుడు పెంచబోతున్నారు.

Ayodhya: నేడు అయోధ్యకు 50 లక్షల మంది భక్తుల రాక.. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు

త్వరలో మరిన్ని అణ్వాయుధ క్షిపణుల్ని తయారు చేయాలని తన పార్టీ నేతలు, అధికారులకు సూచించారు. ఇటీవల కిమ్ తన వర్కర్స్ పార్టీ నేతలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా ఆయుధ సామర్ధ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. భారీ ఎత్తున ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల్ని తయారు చేయాలని, అణ్వాయుధ నిల్వల్ని పెంచుకోవాలని ఆదేశించారు. అమెరికాతోపాటు, దక్షిణ కొరియాను ఎదుర్కోవాలంటే ఇవన్నీ సిద్ధం చేయాలన్నారు. ఉత్తర కొరియా తన సార్వభౌమత్వాన్ని రక్షించుకునేందుకు, భద్రత కోసం భారీ సైనిక సామర్ధ్యాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉందని కిమ్ అన్నారు. అమెరికా, దక్షిణ కొరియా కలిపి తమను ఒంటరిని చేసి, దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కిమ్ ఆరోపించారు.

New Year-2023 celebrations : తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా న్యూఇయర్ వేడుకలు.. కేక్ కటింగ్స్, డ్యాన్స్, కేరింతలతో సందడి

ఈ దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవాలంటే దేశంలో మరిన్ని అణ్వాయుధ క్షిపణుల్ని తయారు చేయక తప్పదని కిమ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఉత్తర కొరియా-దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. గత వారం దక్షిణ కొరియాలోకి ఉత్తర కొరియా డ్రోన్లతో దూసుకెళ్లింది. బదులుగా దక్షిణ కొరియా మిస్సైల్స్ ప్రయోగించింది. అవి కూడా ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్స్‌ని ఉత్తర కొరియా భూభాగంలోకి ప్రయోగించింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అణ్వాయుధాలు, క్షిపణులపై కిమ్ దృష్టి సారించాడు.