Kristin Harila : 90రోజుల్లో ప్రపంచంలోనే 14 పర్వతశిఖరాలు అధిరోహించాలని టార్గెట్ .. ఆ రికార్డు బ్రేక్ చేయటానికి మహిళ సాహస యాత్ర

ప్రపంచంలోనే ఎత్తైన 14 పర్వతాలపై తన దేశపు జెండా ఎగురవేయటానికి ఓ మహిళ సంకల్పించుకున్నారు. ఇప్పటికే ఎనిమిది పర్వతాలు అధిరోహించారు. అలా ఆమె సంకల్పబలంతో ఆమె టార్గెట్ పూర్తి చేసిన సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పటానికి అడుగులు వేస్తున్నారు.

Kristin Harila : 90రోజుల్లో ప్రపంచంలోనే 14 పర్వతశిఖరాలు అధిరోహించాలని టార్గెట్ .. ఆ రికార్డు బ్రేక్ చేయటానికి మహిళ సాహస యాత్ర

Norway mountainee Kristin Harila

Norway mountainee Kristin Harila : అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చనే సంకల్ప బలంతో ప్రపంచ యాత్ర ప్రారంభించిందో మహిళ. కేవలం 90 రోజుల్లో ఒకటీ కాదు రెండు కాదు ఏకంగా 14 పర్వతాలను అధిరోహించాలని టార్గెట్ గా పెట్టుకుని ఇప్పటికే 8 పర్వతాలను అధిరోహించి తన దేశపు జెండా ఎగురవేశారు. ఆమే నార్వే (Norway)కు చెందిన  37 ఏళ్ల క్రిస్టిన్‌ హరిల (Kristin Harila). మూడు నెలల్లో ప్రపంచంలోని ఎత్తైన 14 పర్వత శిఖరాలను అధిరోహించాలని సంకల్పించుకున్నారు క్రిస్టన్ హరిల.

 

2019లో ఓ పర్వతారోహకుడు ఆరు నెలల్లో 14 శిఖరాలను అధిరోహించి క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేయటానికి హరిల ఈ సాహసయాత్ర చేపట్టారు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో భాగంగా హరిల నేపాల్‌లోని మనస్లూను పర్వతాన్ని అధిరోహించడానికి కాట్మండుకు చేరుకున్నారు.

 

తన టార్గెట్ గురించి హరిల మంగళవారం (జూన్ 6,2023) మాట్లాడుతూ.. ఇప్పటికి తన ప్రపంచయాత్ర మొదలై 40 రోజులు అయిందని తెలిపారు. ఈ 40రోజుల్లో ఎనిమిది పర్వతాలను అధిరోహించానని మరి కొన్ని రోజుల్లోనే మనస్లూను పర్వతాన్ని (Mount Manaslu)అధిరోహిస్తానని తెలిపారు.

ఆ తరువాత పాకిస్థాన్ లోని K2 శిఖరాన్ని అధిరోహించాలని ప్లాన్ వేసుకున్నానని తెలిపారు. ముందుగా తాను వేసుకున్న రూట్ మ్యాప్ ప్రకారంగా పర్వతాలను అధిరోహితున్నానని వివరించారు. 2019లో ఓ పర్వతారోహకుడు ఆరు నెలల్లో 14 శిఖరాలను అధిరోహించి నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టడానికి ఈ యాత్ర ప్రారంభించానని హరిల తెలిపారు.

గత ఏప్రిల్ లో ఎవరెస్ట్ పర్వతం (everest mountain), అలాగే చైనా (China), నేపాల్ (Nepal)లోని ఇతర శిఖరాలను అధిరోహించారు హరిల. దీంట్లో భాగంగానే జూన్ 5న అన్నపూర్ణ పర్వతాన్ని (annapurna mountain) అధిరోహించారు. ఈ పర్వతం ఉత్తర నేపాల్ గండకి ప్రావిన్స్ లో ఉంది. సముద్ర మట్టానికి 8,091 మీటర్ల (26,545 అడుగులు) ఎత్తులో ఉంది. అన్నపూర్ణ పర్వతం ప్రపంచంలో 8వ ఎత్తైన పర్వతం. దీన్ని అధిరోహించటం చాలా కష్టంతో కూడుకున్నది. అటువంటి పర్వతాన్ని కూడా ఇప్పటికే అధిరోహించారు క్రిస్టిన్ హరిల.