అమెరికా కన్నా బెటర్ : మెక్సికోకి క్యూ కట్టిన తెలుగు టెక్కీలు

  • Published By: veegamteam ,Published On : December 19, 2019 / 02:36 PM IST
అమెరికా కన్నా బెటర్ : మెక్సికోకి క్యూ కట్టిన తెలుగు టెక్కీలు

ఐటీ జాబ్ లకు అడ్డా ఏది అంటే.. అమెరికా అని చెబుతారు. ముఖ్యంగా ఇండియన్స్. అందులోనూ తెలుగువారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం తెలుగువాళ్లు ఎక్కువగా అమెరికా వెళ్లేవారు. కానీ ఇది గతం. ఇప్పుడు అమెరికా వద్దు.. మెక్సికో ముద్దు అంటున్నారు తెలుగువాళ్లు. అవును.. అమెరికా కన్నా మెక్సికో బెటర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మెక్సికో.. తెలుగు టెక్కీలకు అడ్డాగా మారింది. క్రమంగా అక్కడ తెలుగు కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. మెక్సికో లోని గ్వాడలజరా నగరం.. తెలుగు కుటుంబాలకు కేరాఫ్ గా మారింది.

ప్రస్తుతం గ్వాడలజరా సిటీలో 2వేల తెలుగు కుటుంబాలు నివాసం ఉంటున్నాయని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేష్(TITA) ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాలా చెప్పారు. మెక్సికో లో 125 ఐటీ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. టీసీఎస్, హెచ్ సీ ఎల్ లాంటి ఐటీ దిగ్గజాలు ఉన్నాయని వెల్లడించారు.

అమెరికాలోని ఇతర నగరాలతో పోలిస్తే.. మెక్సికో సిటీ బెటర్ అని తెలుగు వారు అనడానికి కారణాలు లేకపోలేదు. ఇతర నగరాలతో పోలిస్తే గ్వాడలజరా నగరంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. ఐటీ కంపెనీలు ఎక్కువ. పైగా ఉద్యోగ అవకాశాలు, జీతాలూ ఎక్కువే. అందుకే తెలుగు వారు ఇప్పుడు మెక్సికో వైపు చూస్తున్నారని ఐటీ నిపుణులు వివరించారు. భవిష్యత్తులో మెక్సికో లో నివసించే తెలుగు కుటుంబాల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. గ్వాడలజరా మరో బెంగళూరు అంటున్నారు. 

* బెంగళూరు తరహాలోనే గ్వాడలజరా సిటీలో కాస్టాఫ్ లివింగ్ తక్కువ
* చాలా సులభంగా పీజీ హాస్టల్స్ దొరుకుతాయి
* నెలకు రూ.15వేలతోనే సింగిల్ రూమ్ దొరుకుతుంది
* గ్వాజలజారాలో ఐటీ కంపెనీలు ఎక్కువ, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ
* ఫ్రెషర్ కి నెలకు లక్ష 10వేల రూపాయల జీతం వస్తుంది
* ఎక్కువ మంది భారతీయులు(తెలుగువారు) నివాసం ఉండే ప్రాంతం
* క్రైమ్ రేట్ తక్కువ
* సులభంగా వీసా పొందొచ్చు
* అమెరికాతో పోలిస్తే ట్యాక్స్ లు తక్కువ