Mystery : రోగులకు గాలి ఇంజెక్షన్ చేసిన నర్సు.. నలుగురు మృతి

హాస్పిటల్ లో నర్సుగా విడుదలు నిర్వహిస్తున్న వ్యక్తి నలుగురు పేషంట్లను హత్య చేశాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ లో చోటుచేసుకుంది.

Mystery : రోగులకు గాలి ఇంజెక్షన్ చేసిన నర్సు.. నలుగురు మృతి

Mystery

Mystery : హాస్పిటల్ లో నర్సుగా విడుదలు నిర్వహిస్తున్న వ్యక్తి నలుగురు పేషంట్లను హత్య చేశాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే 37ఏళ్ల విలియం డేవిస్ క్రిస్టస్ మదర్ ఫ్రాన్సిస్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నాడు. ఇతడు గుండె ఆపరేషన్ కోసం వచ్చిన నలుగురు పేషంట్లకు గాలిని ఇంజెక్ట్ చేసి హత్యచేశాడు. ఈ ఘటనలో డేవిస్‌ను కోర్టు మంగళవారం దోషిగా తేల్చింది. అతడికి మరణశిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2017 జూన్ నుంచి 2018 జనవరి వరకు ఏడుగురిని డేవిస్ లక్ష్యంగా చేసుకున్నాడని ప్రాసిక్యూటర్లు కోర్టులో వాదనలు వినిపించారు.

చదవండి : Government Hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడ పిల్లకు జన్మనిచ్చిన అడిషనల్ కలెక్టర్

47 నుంచి 74 ఏళ్ల మధ్య వయసుగల నలుగురు పేషంట్లకు క్రిస్టస్ మదర్ ఫ్రాన్సిస్ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ జరిగిన తర్వాత హఠాత్తుగా మూర్ఛ వచ్చి చనిపోయారు. ఆపరేషన్ విజయవంతమైన తర్వాత వారు మృతి చెందటంతో వైద్యులతో అందులన కలిగింది. ఈ నేపథ్యంలోనే మృతదేహాలకు సీటీ స్కాన్‌ తీశారు. సిటీ స్కాన్ లో మెదడులో గాలి చేరినట్లు కనిపించింది. ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఆపరేషన్ చేసినప్పటికి ఇలా ఎలా జరిగిందని ఆలోచనలో పడ్డారు వైద్యులు. మృతుల గదిలోని సీసీకెమెరాలను గమనించిన వైద్యులు డేవిస్ వీరి హత్యకు కారణమని గుర్తించారు.

చదవండి : Private Hospital: వామ్మో..కోవిడ్‌ పేషెంటుకు రూ.1.8కోట్ల బిల్లు..!

పేషెంట్ రూమ్‌లో ఎవరు లేని సమయంలో డేవిస్ వచ్చినట్లు సీసీ టీవీల్లో రికార్డు అయింది. అతడు వచ్చి వెళ్లిన మూడు నిమిషాలకే పల్స్ మీటర్ ఆగిపోయింది. నలుగురి విషయంలో ఇదే జరిగింది. దీంతో అతడే వీరి మృతికి కారణమని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఈ కేసు విషయంలో మంగళవారం వాదనలు జరిగాయి. పేషెంట్లు డేవిస్‌ చర్య వల్లే చనిపోయారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని విచారణ సమయంలో ఆయన తరఫు న్యాయవాది ఫిలిప్ హేస్ వాదించారు. తీవ్రమైన విధానపరమైన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఆసుపత్రి డేవిస్‌ను బలిపశువును చేస్తోందన్నారు.

చదవండి : Hospital : కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

అయితే డేవిస్‌కు మరణశిక్ష వేయాలని ప్రాసిక్యూటర్లు కోరుతున్నారు. డేవిస్‌ ప్రజలను చంపాలనుకున్నాడు. వారి హత్యలతో పైశాచిక ఆనందాన్ని పొందాడని వారు పేర్కొన్నారు. జ్యూరీ తీర్పు బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం ఇవ్వడానికి సహాయపడుతుందని ఈ ఘటనలు జరిగిన క్రిస్టస్ మదర్ ఫ్రాన్సిస్ హాస్పిటల్ తెలిపింది.