OMG..Queen Elizabeth in clouds : క్వీన్ ఎలిజబెత్ రూపంలో ఆకాశంలో మేఘం..! వైరల్ అవుతున్న రాణి మేఘం ఫొటో..!!

96 ఏళ్ల వయస్సులో యునైటెడ్ కింగ్ డమ్ రాణి ఎలిజబెత్ మరణించారు. ఆమె మరణించిన కొంత సమయానికే మేఘాల్లో ప్రత్యక్షమయ్యారు? ఈ వింతతో బ్రిటన్ వాసులు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఆకాశంలో బంగారు వర్ణంలో ఎలిజబెత్ రాణిని పోలిన మేఘం కనిపించటంతో ఆమె అభిమానులు పరవశించిపోతున్నారు. ఈ మేఘం ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

OMG..Queen Elizabeth in clouds : క్వీన్ ఎలిజబెత్ రూపంలో ఆకాశంలో మేఘం..! వైరల్ అవుతున్న రాణి మేఘం ఫొటో..!!

Queen Elizabeth in clouds

Queen Elizabeth in clouds : బ్రిటర్ రాణి క్వీన్ ఎలిజబెత్ మరణంతో కేవలం యునైటెడ్ కింగ్ డమ్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్వీన్ ఎలిజబెత్ మరణంతో బ్రిటన్ వాసులు శోకసముద్రంలో మునిగిపోయారు.చెక్కు చెదరని ఆమె చిరునవ్వు కళ్లముందు కదలాడుతుంటే ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాయల్ కుటుంబంలో క్వీన్ ఎలిజబెత్ శకం ఓ సువర్ణక్షం. అటువంటి ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు బ్రిటన్ ప్రజలు. ఆమె రాజసాన్ని అందరూ గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

Cloud formation that resembles Queen Elizabeth

96 ఏళ్ల ఎలిజబెత్ రాణి స్కాట్లాండ్ లోని వేసవి విడిది నివాసంలో గురువారం కన్నుమూశారు. ఆమె మరణ వార్తను అధికారికంగా ప్రకటించిన తర్వాత లండన్ లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ‘మేఘంలో క్వీన్ ఎలిజబెత్ రూపం’ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్వీన్ ఎలిజబెత్ మరణానికి మేఘాలు కూడా ఇంతగా కదలిపోయి ఆమెకు ఆమె రూపంగా రూపొంది అంజలి ఘటిస్తున్నాయా? అన్నట్లుగా ఉందీ ఫోటో. అచ్చంగా క్వీన్ ఎలిజబెత్ రూపం మేఘంలా మారి కనువిందుచేస్తోంది. ఆమె రూపాన్ని సాక్షాత్కరిస్తోంది.

లిన్నే అనే మహిళ తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి కారులో వెళ్తుండగా… ఆకాశంలో బంగారు వర్ణంలో ఎలిజబెత్ రాణిని పోలిన మేఘం కనిపించింది. దీంతో… ఆమె తెగ ఆశ్చర్యపోయింది. ‘క్వీన్’ అని గట్టిగా అరిచిన కుమార్తె తన తల్లికి ఆ దృశ్యాన్ని చూపించింది. అప్పటికి క్వీన్ ఎలిజబెత్ చనిపోయినట్లుగా రాజకుటుంబం ప్రకటించి కేవలం గంట మాత్రమే అయ్యింది. ఈక్రమంలో మేఘంలో క్వీన్ ఎలిజబెత్ రూపాన్నిచూసి ఎంతో ఆశ్చర్యపోయిన లిన్నే క్వీన్ మేఘాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.

Queen Elizabeth II: Double rainbow spotted above Buckingham Palace as  crowds gather for the Queen | The Independent

మరోవైపు..నిన్న రాణి అధికారిక నివాసం బకింగ్ హామ్ ప్యాలెస్ మీదుగా ఆకాశంలో రెండు ఇంద్ర ధనుస్సులు కనిపించాయి. ఈ వింతను లండన్ ప్రజలు తమ కెమెరాల్లో బంధించారు. ఈ ఇంధ్రధనుస్సుల మీదుగా రాణి స్వర్గానికి వెళ్లారని పలువురు కామెంట్ చేస్తున్నారు. అంతేనేమో..ఎందుకంటే ఆమె క్వీన్ ఎలిజబెత్ మరి..కేవలం క్వీనే కాదు..ప్రపంచం మెచ్చిన నేత..అందుకే ఆమె దటీజ్ క్వీన్ ఎలిజబెత్..