Omicron: ‘కేసులు పెరుగుతున్నాయ్.. హాస్పిటల్‌లో చేరే పరిస్థితులు లేవు’

దక్షిణాఫ్రికాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దినదినగండంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఆ దేశాలన్నీ కేసులు పెరుగుతున్నప్పటికీ...

Omicron: ‘కేసులు పెరుగుతున్నాయ్.. హాస్పిటల్‌లో చేరే పరిస్థితులు లేవు’

South Africa

Omicron: దక్షిణాఫ్రికాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దినదినగండంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఆ దేశాలన్నీ కేసులు పెరుగుతున్నప్పటికీ హాస్పిటల్ లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉందని, ఇది కాస్త సంతోషించదగ్గ అంశమని అంటున్నారు ప్రెసిడెంట్ సిరిల్ రమఫోసా.

‘హాస్పిటల్ లో చేరికలు పెరగడం లేదు. పాజిటివ్ వచ్చినప్పటికీ పెద్దగా లక్షణాలు కనిపించకపోవడంతో హాస్పిటల్ కు రాకుండా ఇళ్లలోనే ఉండిపోతున్నారు’ అని చెప్తున్నారు రమాఫోసా.

ఘనాకు అధికారిక పర్యటనకు వెళ్లిన ప్రెసిడెంట్.. దక్షిణాఫ్రికాతో పాటు ఇతరు ఆఫ్రికా దేశాలకు వెళ్లకూడదని నిబంధనలు విధించిన దేశాలను తిట్టిపోశారు. ‘వేరియంట్ పట్ల ఇంకా పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. రీసెర్చ్ ఇంకా జరుగుతూనే ఉంది. కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రాణాల మీదకు వచ్చిందంటూ ఎవరూ హాస్పిటల్ వరకూ రావడం లేదని.. కాస్త ఊపిరిపీల్చుకోదగ్గ విషయమేనని’ అన్నారు ప్రెసిడెంట్.

………………………………. : రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలు-ఇద్దరు నిందితులు అరెస్టు

ఆరోగ్యశాఖ అధికారి జో ఫాహ్లా మాట్లాడుతూ.. ‘ప్రజలు భయపడాల్సిన అవసర్లేదని అంటూనే కొత్త వేరియంట్ వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల’ని సూచించారు.

నవంబర్ చివరి నెలల్లో కనిపించిన కొత్త వేరియంట్.. కేసులు 19వేల 302 నుంచి 75వేలకు చేరుకున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనికి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. కొత్త ట్రావెల్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పింది.

……………………………………..: జైపూర్‌లో పెళ్లికి హాజరైన 9మంది ఒమిక్రాన్ పేషెంట్లు