Grifthorse : 10 కోట్లకు పైగా ఆండ్రాయిడ్‌ యూజర్లకు ముప్పు.. ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి

సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో మాల్ వేర్ సాయంతో సైబర్ దాడులకు రెడీ అయిపోయారు. అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్‌ సెక్యూ

Grifthorse : 10 కోట్లకు పైగా ఆండ్రాయిడ్‌ యూజర్లకు ముప్పు.. ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి

Grifthorse

Grifthorse : సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో మాల్ వేర్ సాయంతో సైబర్ దాడులకు రెడీ అయిపోయారు. అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్‌ సెక్యూరిటీ సంస్థ జింపేరియం విడుదల చేసిన నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో 10 మిలియన్లకు పైగా ఆండ్రాయిడ్‌ యూజర్లు ప్రమాదంలో పడనున్నారని తెలిపింది. ‘గ్రిఫ్ట్‌ హార్స్‌’ అనే మాల్‌వేర్‌ సాయంతో సైబర్‌ నేరస్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆ నివేదిక వెల్లడించింది.

70 దేశాలకు చెందిన ఆండ్రాయిడ్‌ యూజర్ల అకౌంట్ల నుంచి డబ్బు కాజేసేందుకు సైబర్ క్రిమినల్స్ గ్రూప్ ఒకటి నవంబర్ 2020 నుంచి క్యాంపెయిన్‌ చేస్తోందని జింపేరియం హెచ్చరించింది. సైబర్‌ నేరస్తులు పక్కా ప్లాన్‌తో గూగుల్‌ ప్లే స్టోర్‌, థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా లింక్స్‌ పంపి యూజర్ల ఈ-మెయిల్‌, బ్యాంక్‌ ఖాతాల వివరాలను తస్కరిస్తారంది.

Caffeine : టీ,కాఫీలలో ఉండే కెఫిన్ వల్ల ఆరోగ్యానికి నష్టమా?..లాభమా?..

డబ్బు ఇలా దొంగిలిస్తారు?
* సైబర్‌ నేరస్తులు ముందుగా లోకల్‌ లాంగ్వేజ్‌లో యూజర్లను అట్రాక్ట్‌ చేసేలా యాడ్స్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్లకు పంపుతారు.
* ఆ యాడ్స్‌ లో ఉన్న లింక్‌ క్లిక్‌ చేస్తే కళ్లు చెదిరే బహుమతులు ఇస్తామని ఊరిస్తారు.
* ఆ ఆఫర్లకు అట్రాక్ట్‌ అయ్యి యూజర్లు పొరపాటున ఆ లింక్‌ క్లిక్‌ చేశారో ఇక అంతే సంగతులు.
* మీరు సెలక్ట్‌ చేసుకున్న గిఫ్ట్‌ మీకు కావాలనుకుంటే ఫోన్‌ నెంబర్‌తో పాటు మెయిల్‌ ఐడీ, వ్యక్తిగత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌ పంపుతారు.
* వ్యక్తిగత వివరాలను నమోదు చేసే సమయంలో ఐపీ అడ్రస్‌ ద్వారా వాటిని దొంగిలించి డైరెక్ట్‌గా యూజర్‌ ఖాతాలో ఉన్న డబ్బుని కాజేస్తారు.

Basil : తులసితో మానసిక ఒత్తిడి మాయం..!

అంతేకాదు, తాము అందించే భారీ గిఫ్ట్‌లు కావాలనుకుంటే ప్రీమియం చెల్లించాలని చెబుతారు. ఇలా 70 దేశాల్లో ఒక్కో యూజర్‌ నుంచి ప్రతి నెలా రూ.3వేల 100 వసూలు చేస్తారని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ జెడ్‌ల్యాబ్స్‌ తెలిపింది. 2021లో ఇదే అత్యంత ప్రమాదకరమైన సైబర్‌ దాడి అని చెప్పింది.

గ్రిఫ్ట్ హార్స్ మాల్ వేర్ తో ఇన్ ఫెక్ట్ అయిన పాపులర్ యాప్స్..
* Handy Translator Pro
* Heart Rate and Pulse Tracker
* Geospot: GPS Location Tracker
* iCare-Find Location
* My Chat Translator.

కంపెనీ నివేదిక ప్రకారం.. భారత్ లోనూ కొందరు ఆండ్రాయిడ్ యూజర్లు ఆ మాల్ వేర్ బారిన పడ్డారు. సైబర్ దాడి గురించి తెలిసిన వెంటనే కంపెనీ.. గూగుల్ ని కాంటాక్ట్ చేసింది. గ్రిఫ్ట్ హార్స్ ఎఫెక్టడ్ యాప్స్ గురించి తెలియజేసింది. అంతేకాదు గూగుల్ ఆ యాప్ లను ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేసింది. అయితే ఈ యాప్ లు ఇంకా థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్ లో ఉండొచ్చని చెప్పింది. ఆండ్రాయిడ్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. గిఫ్ట్ లు, ప్రైజ్ లు, స్పెషల్ ఆఫర్లకు ఆశపడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అజ్ఞాత వ్యక్తులు, నెంబర్ల నుంచి వచ్చే లింకుల జోలికి వెళ్లకపోవడమే మంచిదన్నారు.