పాకిస్తాన్ లో టిక్ టాక్ బ్యాన్

  • Published By: venkaiahnaidu ,Published On : October 9, 2020 / 07:04 PM IST
పాకిస్తాన్ లో టిక్ టాక్  బ్యాన్

Pakistan bans TikTok ఈమధ్యకాలంలో విపరీతంగా పాపులర్ అయిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ‘ టిక్ టాక్’కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే భారత్,అమెరికాలో బ్యాన్ చేయబడిన ఈ చైనా యాప్ ను ఇప్పుడు పాకిస్తాన్ కూడా బ్యాన్ చేసింది.

టిక్ టాక్ ను బ్యాన్ చేసినట్లు శుక్రవారం(అక్టోబర్-9,2020)పాకిస్తాన్ ప్రకటించింది. టిక్ టాక్ లోని అనైతిక మరియు అసభ్యకరమైన కంటెంట్ గురించి సమాజంలోని వివిధ వర్గాల నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు రావడంతోనే ఇమ్రాన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ టెలీకమ్యూనికేషన్స్ అథారిటీ(PTA) తెలిపింది.


టిక్ టాక్ లో పోస్ట్ చేసే కంటెంట్ గురించి తమకు కొంతకాలంగా పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో టిక్ టాక్ కంపెనీకి నోటీసులు ఇచ్చామని,తమ వివరణ ఇచ్చేందుకు కంపెనీకి కొంత సమయం ఇచ్చినట్లు PTA తెలిపింది. చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ కంటెంట్ విషయంలో చురుకైన నియంత్రణ కోసం సమర్థవంతమైన యంత్రాంగాన్ని డెవలప్ చేయడానికి అథారిటీ సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించామని PTA తెలిపింది.


అయితే టిక్ టాక్ కంపెనీ తమ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోలేదని..దీంతో పాకిస్థాన్ లో ఈ యాప్ బ్యాన్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పాకిస్థాన్ టెలీకమ్యూనికేషన్స్ అథారిటీ(PTA) ఓ ప్రకటనలో తెలిపింది.