Pakistan energy saving plan : ‘పాపం పాకిస్థాన్‌’.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చీకట్లో మగ్గిపోతున్న జనాలు..కుంటుబడిన వ్యాపారాలు

పాపం పాకిస్థాన్. పాకిస్థాన్‌‌కు పట్టిన దరిద్రం మామూలుగా లేదు. . తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, కష్టాలు, నష్టాల్లో పడి కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ సర్కార్‌ కొత్తగా అమల్లోకి తెచ్చిన ఆంక్షలు జనాన్ని మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. అదే ‘సేవ్ ఎనర్జీ ప్లాన్’..ఇదంతా చూస్తుంటే..

Pakistan energy saving plan : ‘పాపం పాకిస్థాన్‌’.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో  చీకట్లో మగ్గిపోతున్న జనాలు..కుంటుబడిన వ్యాపారాలు

Pakistan energy saving plan _

Pakistan energy saving plan : ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు కష్టాల్లో ఉన్నాయి. దీనికి కోవిడ్ ఓ కారణం అయితే మరోపక్క ఆర్థిక సంక్షోభం. ఇలా కష్టాలకు పలు కారణాలున్నాయి. ఆ కష్టాల్లోంచి బయటపడటానికి ఆయా దేశాలు యత్నిస్తున్నాయి. కానీ పాకిస్థాన్ మాత్రం తన అనాలోచిత నిర్ణయాలతో మరింత సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇటువంటి పిచ్చి నిర్ణయాల్లో భాగంగా పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల్ని మరింత కష్టాల్లోకి నెట్టేస్తోంది. ఇది పాకిస్థాన్‌‌కు పట్టిన దరిద్రానికి ప్రతీకలా కనిపిస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, కష్టాలు, నష్టాల్లో పడి కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ సర్కార్‌ కొత్తగా అమల్లోకి తెచ్చిన ఆంక్షలు జనాన్ని మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. అదే ‘సేవ్ ఎనర్జీ ప్లాన్’..

ఇదంతా చూస్తుంటే.. పాపం పాకిస్థాన్‌ అని. మరి.. ప్రపంచ దేశాలన్నీ ముందుకు వెళుతుంటే.. పాకిస్థాన్ మాత్రం వెనక్కి వెళుతోంది. కానీ తప్పదు. ఎందుకంటే.. దేశం పరిస్థితి అస్సలు బాగోలేదు. ఇప్పట్లో.. ఏమాత్రం కోలుకునే పరిస్థితి ఉండదు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలన్నా.. సంక్షోభం నుంచి బయటపడాలన్నా.. ఎంతో కొంత సేవ్ చేయాల్సిందే. ఎంతో కొంత కూడా కాదు.. కష్టమైనా, నష్టమైనా.. వీలైనంత ఎక్కువగా పొదుపు చేయాల్సిందే. ఆర్థిక సంక్షోభం మరింత ముదరకుండా అన్నీ అదుపు చేయాల్సిందే. అలాగే వదిలేస్తే.. చివరికి పొదుపు చేయడానికి కూడా ఏమీ మిగలక.. మరింత పాతాళానికి దిగజారాల్సి వస్తుంది. ఇంకా నయం.. ఇప్పటికైనా పాక్ ప్రభుత్వం మేల్కొందనే టాక్ వినిపిస్తోంది.

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌.. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కీలక చర్యలను ప్రకటించింది. విద్యుత్ ఉత్పత్తి ఖర్చును దక్కించుకునేందుకు మార్కెట్లను, షాపింగ్ మాల్స్‌ని రాత్రి ఎనిమిదిన్నరకే మూసేయాలని, ఫంక్షన్ హాల్స్‌ని కూడా రాత్రి 10 గంటలకే బంద్ చేయాలని ఆదేశాలిచ్చింది. పాకిస్థాన్‌ ప్రభుత్వం చేపట్టిన ఇంధన పొదుపు పథకం కింద.. ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంధనాన్ని ఆదా చేసేందుకు, చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు.. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ ప్లాన్‌కు పాకిస్థాన్‌ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Pakistan Economic Crisis: ప్లాస్టిక్ కవర్లలో వంటగ్యాస్ నిల్వ.. పాక్‌లో దారుణ పరిస్థితులు.. వీడియోలు వైరల్

సాధారణ సమయానికంటే ముందుగానే మార్కెట్లు, మాల్స్, ఫంక్షన్ హాల్స్ క్లోజ్ చేయడం ద్వారా.. 6 వేల కోట్ల పాకిస్థానీ రూపాయలు ఆదా అవుతాయని చెబుతోంది ప్రభుత్వం. అంతేకాదు.. దేశంలో నెలకొన్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇంకా చాలానే చేయబోతోంది పాకిస్థాన్‌. ఫిబ్రవరి నుంచి సాధారణ బల్బుల తయారీని కూడా నిలిపేస్తున్నారు. జులై నుంచి నాసిరకం ఫ్యాన్ల ఉత్పత్తిని కూడా ఆపేస్తున్నారు. దీంతో.. మరో 2 వేల 2 వందల కోట్లు ఆదా అవుతాయని పాకిస్థాన్‌ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఏడాది లోపే.. కొనికల్ గీజర్ల వాడకాన్ని కూడా తప్పనిసరి చేయనుంది పాక్ ప్రభుత్వం. ఫలితంగా.. తక్కువ గ్యాస్ వినియోగంతో 9 వేల 2 వందల కోట్లు మిగులుతాయ్. స్ట్రీట్ లైట్స్‌లో మార్పులు చేయడం ద్వారా మరో 4 వందల కోట్లు ఆదా అవుతాయ్. ఇందుకోసం.. ఇంధన పొదుపు ప్రణాళికను వెంటనే అమలు చేస్తున్నట్లు పాక్ రక్షణమంత్రి తెలిపారు.

ఇకపై.. అన్ని ప్రభుత్వ భవనాలు ప్రణాళిక ప్రకారం ఇంధన వినియోగాన్ని తగ్గిస్తాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 30 శాతం విద్యుత్ ఆదా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు.. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కూడా వీలైనంత త్వరగా అమలు చేయబోతున్నారు. దీని ద్వారా 6 వేల 2 వందల కోట్లు ఆదా అవుతాయని చెబుతున్నారు. ఇక.. చమురు దిగుమతులను తగ్గించేందుకు.. ఈ ఏడాది చివరినాటికి ఎలక్ట్రిక్ బైక్‌లను కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది పాక్ సర్కార్. ఇంధనాన్ని ఆదా చేసే ప్రణాళికను వెంటనే అమలు చేసేందుకు.. పాకిస్థాన్‌ మంత్రివర్గమంతా ఆ పనిమీదే ఉండనుంది.

Pakistan energy saving plan : పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభానికి తోడు విద్యుత్ సంక్షోభం,రాత్రి 8.30 గంటలకే మార్కెట్లు బంద్..ఫంక్షన్ హాల్స్ మూసివేత

పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. ఆ దేశంతో పాటు అక్కడి ప్రజలపై నేరుగా ప్రభావం చూపనున్నాయ్. దెబ్బకు పాకిస్థాన్‌‌ పబ్లిక్ లైఫ్ స్టైలే మారబోతోంది. ఇప్పటిదాకా రాత్రి పూట ఎంతసేపు బయట తిరిగినా.. మాల్స్‌లో గంటలకొద్దీ సరదాగా గడిపినా.. ఫంక్షన్‌హాల్స్‌లో అర్ధరాత్రి దాటే దాకా ఈవెంట్స్‌లో ఎంజాయ్ చేసినా ఎవరూ అడిగేవారు కాదు. కానీ.. ఇకపై అలా కాదు. మార్కెట్లు ఎనిమిదిన్నరకే క్లోజ్ అయిపోతాయ్. ఫంక్షన్ హాల్ గేట్లు.. 10 గంటలకే మూసేస్తారు. సో.. ఇకపై.. అక్కడ ఇంతకుముందులా ఉండదు. కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నట్లుగానే ఉంటుంది. రాత్రిళ్లు ఎక్కడికి వెళదామనుకున్నా.. మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఎనిమిదిన్నర తర్వాత ఒక్క షాప్ కూడా తెరిచి ఉండదు. రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, హోటల్స్.. ఇలా ఎక్కడికెళ్లినా కిందికి దించిన షట్టర్లు, వాటికి వేసిన తాళాలే కనిపిస్తాయ్. పైగా.. దీనికి కచ్చితమైన టైమ్ పీరియడ్ కూడా ఏమీ లేదు. ఈ పరిస్థితులు ఎన్నాళ్లు కొనసాగుతాయో చెప్పలేం. పాకిస్థాన్‌ ఆర్థికపరిస్థితి మెరుగుపడి, దేశం సంక్షోభం నుంచి తేరుకునేదాకా.. ఇదిలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అప్పటివరకు పాక్ జనం నైట్‌లైఫ్‌ను మర్చిపోకతప్పదు.