Pakistan energy saving plan : పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభానికి తోడు విద్యుత్ సంక్షోభం,రాత్రి 8.30 గంటలకే మార్కెట్లు బంద్..ఫంక్షన్ హాల్స్ మూసివేత

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభానికి తోడు విద్యుత్ సంక్షోభం కూడా తీవ్రస్థాయిలో ఉంది. దీంతో రాత్రి 8.30 గంటలకే మార్కెట్లు బంద్, 10గంటలకే ఫంక్షన్ హాల్స్ మూసివేత, ఆఖరికి సమావేశాలు కూడా సన్ లైట్ లోనే నిర్వహించుకోవాలంటున్నారు పాకిస్థాన మంత్రులు. పాక్ క్యాబినెట్ తీసుకున్న ఈ ఇందన సేవ్ ప్లాన్ లో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రజలు చీకట్లో మగ్గిపోతున్న పరిస్థితి నెలకొంది.

Pakistan energy saving plan : పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభానికి తోడు విద్యుత్ సంక్షోభం,రాత్రి 8.30 గంటలకే మార్కెట్లు బంద్..ఫంక్షన్ హాల్స్ మూసివేత

Pakistan energy saving plan

Pakistan energy saving plan : పాకిస్తాన్ ను ఏలినాటి శని పట్టినట్లుగా ఉంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటటం, పెట్రోలియం, గ్యాస్‌ నిల్వలు తగ్గిపోవడం, పతనమవుతున్న కరెన్సీ విలువ, తీవ్ర ద్రవ్యోల్బణం లాంటివన్నీ.. పాక్‌ను పట్టిపీడిస్తున్నాయి. దాంట్లో బయటపడలేక అల్లాడుతోంది. దీంతో.. సబ్సిడీల భారాన్ని మోయలేక చాలా వాటికి ప్రభుత్వం కోత పెడుతోంది. ఈ క్రమంలోనే ఎనర్జీ సేవింగ్ ప్లాన్‌ని ప్రకటించింది. దీంట్లో భాగంగా (ఎర్లీ టూ బెడ్, ఎర్లీ టూ రైజ్‘ విధానాన్ని అవలంభించాలను చెబుతోంది. అలాగే విద్యుత్ ను ఆదా చేసుకోవటానికి 8.30 గంటలకే మార్కెట్లు బంద్..10 గంటలకే ఫంక్షన్ హాల్స్ మూసివేయాలను చెబుతోంది. పెట్రోల్ లో నడిచే మోటార్ సైకిళ్ల స్థానంలో ఈ-బైక్స్ లను ప్రవేశ పెట్టే యోచనలో ఉన్నట్లుగా చెబుతోంది పాకిస్థాన్ ప్రభుత్వం. ఇళ్లల్లోని ఫ్యాన్లు, విద్యుత్ బల్బులను కూడా రాత్రి తొమ్మిది గంటలకే ఆపేయాలను చెబుతోంది.ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగం తగ్గించాలని చెబుతోంది. ఆఖరికి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని మంగళవారం (జనవరి 3,2023) ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది.

ఇన్నాళ్లూ దేశాన్ని గాలికొదిలేసి.. ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులను.. ఉగ్రవాదానికి ఫండింగ్ చేసిన పాకిస్తాన్‌కు.. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అర్థమవుతున్నాయ్. ఇన్నాళ్లూ ఏమీ చేయలేక.. పొదుపు పేరుతో చర్యలు మొదలుపెట్టింది. పైగా.. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ప్రజలే తమ అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ.. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు పాక్ నాయకులు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌‌లో.. విద్యుత్ సంక్షోభం కూడా తలెత్తింది. అది ఏ స్థాయిలో ఉందంటే.. చివరకు సమావేశాలు కూడా సన్ లైట్‌లోనే నిర్వహించుకోవాలని చెబుతున్నారు పాక్ మంత్రులు.

ఆర్థిక సంక్షోభంతో.. పాక్ ప్రజల బతుకులు కూడా దుర్భరంగా మారాయ్. చాలా ప్రాంతాల్లో ఉపాధి లేక జనం ఖాళీగా ఉంటున్నారు. కుటుంబ పోషణ కూడా భారమైపోయింది. చివరకు.. గ్యాస్ సిలిండర్ కూడా కొనే పరిస్థితుల్లో లేరు. మరికొందరు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూసి.. ముందుజాగ్రత్త పడుతున్నారు. పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీ ఎత్తేసినట్లే.. రానున్న రోజుల్లో వంట గ్యాస్ పైనా ఆంక్షలు విధిస్తారేమోనని.. ముందే భారీ కవర్లలో నింపి తెచ్చుకుంటున్నారు. మరికొందరు ప్రజలు.. పెరుగుతున్న ధరల భారాన్ని తగ్గించుకునేందుకు వంట గ్యాస్‌ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయ్.

Pakistan energy saving plan : ‘పాపం పాకిస్థాన్‌’.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చీకట్లో మగ్గిపోతున్న జనాలు..కుంటుబడిన వ్యాపారాలు

ఇప్పటికే.. పాక్‌లోని అనేక ప్రాంతాల్లో వంటగ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. పైగా.. ఒక్కో సిలిండర్ ధర 3 వేల 6 వందలు. ఇదొక్కటి చాలు.. పాక్ ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉందో చెప్పడానికి. కొంత కాలంగా దేశ ప్రజలకు వంట గ్యాస్ కూడా అందించలేని దీన స్థితిలో ఉంది పాకిస్తాన్. చివరకు.. సిలిండర్లు కూడా అన్ని కుటుంబాలకు సరిపోయినన్ని అందించలేకపోతోంది. దాంతో.. అక్కడి ప్రజలు వేరే ఆప్షన్ లేక.. ఇలా ప్లాస్టిక్ సంచుల్లో గ్యాస్ నింపుకొని తీసుకెళ్తున్నారు. వీటి కారణంగా జరిగిన ప్రమాదాల్లో.. ఇప్పటికే 8 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఇది ప్రమాదకరంగా మారడంతో.. అధికారులు ఈ తరహా గ్యాస్ సంచుల వినియోగాన్ని నిషేధించారు.

ఇప్పటికే.. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అప్పుల ఊబిలో కూరుకుపోయింది పాకిస్తాన్. కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదు. అందుకే.. ఖర్చులను తగ్గించుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో.. అందులో నుంచి బయటపడేందుకు పొదుపు చర్యలు పాటించాలని నిర్ణయించింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే.. రోజువారీ ఖర్చులకు కూడా కష్టంగా ఉందని.. పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీలు ఎత్తేశారు. ప్రజలకు.. నిత్యావసరాలు కూడా అందించలేకపోతోంది ప్రభుత్వం. ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధిస్తూ.. విద్యుత్ వినియోగంపైనా ఆంక్షలు విధిస్తూ.. నానా తంటాలు పడుతోంది. చాలా ప్రాంతాల్లో.. తినేందుకు తిండి కూడా దొరకక పాకిస్తాన్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసులకు కరెంటును అందించే స్థోమత కూడా లేని దీనస్థితిలో ఉంది పాక్ సర్కార్. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు.. విదేశాల్లో ఉన్న పాకిస్తాన్ ఆస్తులను కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తోంది పాక్ ప్రభుత్వం.

పాకిస్తాన్ కూడా తాము తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయామని.. తమను అంతర్జాతీయ సంస్థలు ఆదుకోవాలని.. లేకపోతే దేశంలో కరువు కాటకాలు తాండవిస్తాయని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే.. మానవతా దృక్పథంతో.. కొన్ని సంస్థలు పాక్‌కు సాయం అందించాయ్. అయితే.. ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తేనే.. సహకరిస్తామని కొన్ని అంతర్జాతీయ సంస్థలు తెలిపాయి. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోనంత కాలం.. సంబంధాలు పెట్టుకోబోమని కొన్ని దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. పాక్ ప్రధాన మిత్రదేశమైన చైనా కూడా కరోనా కేసుల ఉద్ధృతితో.. పాక్‌కు సాయం చేసేందుకు ముందుకు రావట్లేదు. అందువల్ల.. ఆర్థిక సంక్షోభం ఇంకొన్ని నెలలు ఇలాగే కొనసాగితే.. పరిస్థితులు మరీ ఘోరంగా తయారవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. రోజులు గడిచేకొద్దీ.. నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటుతాయ్. అదే జరిగితే.. పాకిస్థాన్ మరో శ్రీలంక అవడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.

Pakistan Economic Crisis: ప్లాస్టిక్ కవర్లలో వంటగ్యాస్ నిల్వ.. పాక్‌లో దారుణ పరిస్థితులు.. వీడియోలు వైరల్

కొన్ని నెలల కిందటే.. పాక్ విదేశీ మారక నిల్వలు కూడా 2.9 బిలియన్ డాలర్లకు పడిపోయాయ్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో.. ద్రవ్యోల్బణం 21 నుంచి 23 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాంతో.. దేశ ఆర్థిక లోటు 115 శాతానికి పైగా పెరిగి.. ఊహించని స్థాయిలో సంక్షోభం పెరిగిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో.. పాకిస్తాన్ పతనం దిశగా పయనిస్తోందన్న విషయం అర్థమవుతోంది.