Layoff in paypal : పేపాల్​లో 2,000 మంది ఉద్యోగుల తొలగింపు .. ప్రకటించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

పేపాల్​లోనూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. 2,000 మంది ఉద్యోగుల తొలగిస్తున్నట్లుగా సంస్థ ప్రకటించింది.

Layoff in paypal : పేపాల్​లో 2,000 మంది ఉద్యోగుల తొలగింపు .. ప్రకటించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

PayPal to cut 2,000 jobs in latest tech layoffs

Layoff in paypal : టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో దిగ్గజ కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి. గూగుల్ సైతం ఉద్యోగుల భారం తగ్గించుకుంటోంది. వీరి అడుగుల్లోనే నగదు లావాదేవీలు, చెల్లింపులు జరిపే ఒక అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థ పేపాల్ (PayPal )కంపెనీ కూడా నడుస్తోంది. పేపాల్ నుంచి 2వేలమంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. పేపాల్ హోల్డింగ్స్ ఇంక్ త్రైమాసికంలో స్థూల ఆర్థిక మందగమనం కారణంగా 2వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా బుధవారం (ఫిబ్రవరి 1,2023)న పేపాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాన్ షుల్మాన్ ప్రకటించారు.

ఉద్యోగుల తొలగింపు సంస్థలో7 శాతం మంది ఉద్యోగులపై ఉంటుందని తెలిపారు. కొన్ని వారాల్లో ఈ ప్రక్రియ అమలు అమలవుతుందని దీనికి సంబంధించి ఉద్యోగులకు మెమో పంపించామని తెలిపారు. ఈ కష్టాన్ని గట్టెక్కటానికి ఉన్న ఉద్యోగులతో పాటు తాము కూడా ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. పేమెంట్ గేట్ వే కంపెనీ అయిన పేపాల్ స్టాక్ దెబ్బతింది.

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత చెల్లింపుల పరిమాణంలో వృద్ధి మందగించడం దీనికి కారణంగా మారిందని ఈ విషయాన్ని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. త్రైమాసిక వృద్ధి (Quarterly growth)త్రైమాసిక వృద్ధితగ్గిన కారణంగా కంపెనీలో ఉద్యోగాల కోతతో పాటు కార్యాలయాల మూసివేతతో ఖర్చులు తగ్గించుకోవాలని పే పాల్ నిర్ణయించింది. ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచుకోవడానికి మా కంపెనీ వేసుకున్న ప్లాన్స్ లో భాగంగా ఇటువంటివి తప్పనిసిరి అయ్యాయని పేపాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాన్ షుల్మాన్ వెల్లడించారు.