Pentagon : కాల్పుల కలకలం..పెంటగాన్ లాక్ డౌన్

పెంటగాన్(అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం బిల్డింగ్)వద్ద కాల్పుల కలకలం రేగింది.

10TV Telugu News

Pentagon పెంటగాన్(అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం బిల్డింగ్)వద్ద తుపాకీ కాల్పుల కలకలం రేగింది. పెంటగాన్ బయట ఉన్న మెట్రో బస్ ఫ్లాట్ ఫాం వద్ద గుర్తు తెలియని వక్తులు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు పెంటగాన్ వద్ద లాక్​డౌన్ విధించారు. ఎవరినీ లోపలికి అనుమతి లేకుండా పెంటగాన్ ని మూసేశారు.

కాగా,కాల్పులు జరిగిన బస్ ప్లాట్‌ ఫామ్‌.. పెంటగాన్‌ కి ప్రధాన ద్వారంగా ఉంది. ప్రతిరోజూ వేలాది మంది సిబ్బంది ఈ మార్గం గుండానే పెంటగాన్ బిల్డింగ్ లోకి వెళ్లడం,రావడం చేస్తుంటారు. .

ఈ ఘటనపై పెంటగాన్ ఫోర్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రతినిధి క్రిస్ లేమన్ మాట్లాడుతూ..కాల్పులు కొనసాగుతున్నట్లు చెప్పాడు. ఆ ప్రాంతం గుండా ప్రయాణించవద్దని ప్రజలను ఆయన హెచ్చరించాడు. అయితే కాల్పులకు ఎంతమంది తెగబడ్డారు లేదా ఎంతమందికి గాయాలయ్యాయి అనేదానిపై ఆయన ఏమీ చెప్పలేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

10TV Telugu News