PM Modi Can Stop War: ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపగలిగే శక్తి మోదీకి ఉంది.. అమెరికా
ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా పుతిన్‌తో ప్రధాని మోదీ మాట్లాడుతూ “నేటి యుగం కాదని నాకు తెలుసు. ప్రజాస్వామ్యం, దౌత్యం, చర్చలు మొత్తం ప్రపంచాన్ని కదిలిస్తాయని మేము మీతో చాలాసార్లు ఫోన్‌లో చర్చించాను" అని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య హింసను తక్షణమే నిలిపివేయాలని మోదీ ఇచ్చిన పిలుపును అమెరికా స్వాగతించింది. ఈ పిలుపుపై ఐరోపా దేశాల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది.

PM Modi can convince Putin to end hostilities in Ukraine, says White House
PM Modi Can Stop War: దాదాపుగా ఏడాది కాలంగా సాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆపగలరని అమెరికా వైట్ హౌజ్ ప్రకటించింది. వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో శత్రుత్వాల ముగింపుకు దారితీసే ఏ ప్రయత్నాన్నైనా అమెరికా స్వాగతిస్తుందని అన్నారు. ఈ సందర్భంలోనే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధాన్ని ఆపడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆపగలరా అని ప్రశ్నించినప్పుడు, ‘అవును, సాధ్యమే’ అని జాన్ కిర్బీ సమాధానం ఇచ్చారు.
“ఈ ప్రయత్నంలో (ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టబోయే ఏ ప్రయత్నానికైనా సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఉక్రెయిన్‌లో శత్రుత్వాల ముగింపుకు దారితీసే ఏ ప్రయత్నాన్నైనా అమెరికా స్వాగతిస్తుంది. యుద్ధాన్ని ఆపడానికి పుతిన్‌కు ఇంకా సమయం ఉందని నేను భావిస్తున్నాను. ప్రధాని మోదీ అందుకు ఒప్పించగలరు. యుద్ధం ఈ రోజు ముగియవచ్చని నేను భావిస్తున్నాను. ఈ రోజే ముగియాలి కూడా” అని వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ “ఉక్రేనియన్ ప్రజలు ఏమి అనుభవిస్తున్నారో దానికి కారణమైన ఏకైక వ్యక్తి వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ మాత్రమే యుద్ధాన్ని ఆపగలరు. అతను అనుకుంటే ఇప్పుడే ఆపగలరు. కానీ అందుకు భిన్నంగా పుతిన్ వ్యవహార శైలి ఉంది. అతను శక్తివంతమైన క్రూయిజ్ క్షిపణులను విసురుతున్నారు. మరింత వేడిని రగుల్చుతున్నారు. దీనివల్ల ఉక్రేనియన్ ప్రజలు మరింత ఎక్కువగా బాధపడుతున్నారు” అని పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీలతో ప్రధాని మోదీ పలుమార్లు మాట్లాడారు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా పుతిన్‌తో ప్రధాని మోదీ మాట్లాడుతూ “నేటి యుగం కాదని నాకు తెలుసు. ప్రజాస్వామ్యం, దౌత్యం, చర్చలు మొత్తం ప్రపంచాన్ని కదిలిస్తాయని మేము మీతో చాలాసార్లు ఫోన్‌లో చర్చించాను” అని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య హింసను తక్షణమే నిలిపివేయాలని మోదీ ఇచ్చిన పిలుపును అమెరికా స్వాగతించింది. ఈ పిలుపుపై ఐరోపా దేశాల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది.