PM Modi US Visit: ఎలాన్ మస్క్‌ను కలుసుకోనున్న ప్రధాని మోదీ.. ట్విటర్ సొంతమైన తర్వాత ఇదే తొలి కలయిక
అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తీరికలేని సమావేశాలతో బిజీగా ఉంటారు. భారతీయ అమెరికన్ల సీఈవోలతో కూడా ప్రధాని సమావేశం కానున్నారు. ఆ తర్వాత బుధవారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన నాయకత్వం వహిస్తారు

Modi and Musk: మెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో పలువురు ఆలోచనాపరులతో సమావేశం కానున్నారు. నోబెల్ గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, పండితులు, వ్యవస్థాపకులు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణుల వంటి ప్రముఖులు ప్రధానిని కలిసే జాబితాలో ఉన్నారు. కాగా, టెస్లా అధినేత, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్‌ను సైతం మోదీ కలుసుకోనున్నారు. మస్క్ ట్విటర్ కొనుగోలు చేసిన అనంతరం మోదీని కలుసుకోవడం ఇదే తొలిసారి.
Nandan Nilekani : ఐఐటీ బాంబే 50 ఏళ్ల వేడుకలు .. రూ.315 కోట్లు విరాళం ఇచ్చిన నందన్ నిలేకని
ఇక విజ్ఞాన శాస్త్రానికి ప్రసిద్ధి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్, సైన్స్ కమ్యూనికేటర్ నీల్ డి గ్రాస్సే టైసన్, ఆర్థికవేత్త-నోబెల్ గ్రహీత అయిన పాల్ రోమర్ లాంటి వారు కూడా ఉన్నారు. పండితుడు, రచయిత అయిన నికోలస్ నాసిమ్ తలేబ్, బిలియనీర్ పెట్టుబడిదారుడు రే డాలియో, ప్రఖ్యాత గాయకుడు ఫాలు షా, మాజీ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ మైఖేల్ ఫ్రోమాన్, దౌత్యవేత్త-మాజీ సహాయ కార్యదర్శి డేనియల్ రస్సెల్‌లు సైతం ప్రధానిని కలుసుకోనున్నారు.
Chiranjeevi : మెగా వారసురాలికి ఎవరి పోలికలు వచ్చాయి.. మెగాస్టార్ ఏమి చెప్పారు..
ఐదు రోజుల అమెరికా దేశ పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ మంగళవారం ఇండియా నుంచి బయలుదేరారు. ప్రధాని మోదీ జూన్ 21వతేదీన భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.30 గంటలకు వాషింగ్టన్‌లోని ఆండ్రూస్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో దిగాల్సి ఉంది. అక్కడ భారతీయ అమెరికన్ బృందం ప్రధానికి స్వాగతం పలకనుంది.
Cristiano Ronaldo: మరో మైలురాయిని చేరుకోనున్న స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ..
అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తీరికలేని సమావేశాలతో బిజీగా ఉంటారు. భారతీయ అమెరికన్ల సీఈవోలతో కూడా ప్రధాని సమావేశం కానున్నారు. ఆ తర్వాత బుధవారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన నాయకత్వం వహిస్తారు. యోగా కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ వాషింగ్టన్ డీసీకి బయలుదేరుతారు. వాషింగ్టన్ డీసీలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ మోదీ గౌరవార్థం ప్రైవేట్ విందు ఏర్పాటు చేశారు.
Alia Bhatt : రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని టీజర్ రిలీజ్.. అదిరేటి శారీల్లో అలియా భట్ అందాలు..
అమెరికా కాంగ్రెస్ సభ్యులతో సహా అన్ని వర్గాల ప్రజలు తన పర్యటన గురించి ఉత్సాహం చూపిస్తున్నారని ప్రధాని సోమవారం పేర్కొన్నారు.(Modi tweet) అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి చెందిన ట్విట్టర్ ఖాతాను మోదీ ట్యాగ్ చేశారు. అందులో యూఎస్ కాంగ్రెస్ సభ్యులు, వ్యాపారవేత్తలు, భారతీయ-అమెరికన్లు ,ఇతరులతో సహా పలువురు వ్యక్తులు అమెరికా దేశ పర్యటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మోదీకి స్వాగతం పలికిన వీడియోలు ఉన్నాయి.
ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు భారతీయ-అమెరికన్లు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి రికీ కేజ్, గాయని మేరీ మిల్బెన్ హాజరుకానున్నారు.జూన్ 21 నుంచి ప్రారంభమయ్యే అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో విస్తృత చర్చలు జరుపుతారు. రెండవసారి యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు.