Polar Night : ఆ ఊళ్లో నాలుగు నెల‌లపాటు రాత్రే.. నెల‌లు గ‌డిచినా సూర్యుడు రాని ప్రాంతాలివే!

ఆ ఊళ్లో నాలుగు నెలలపాటు రాత్రే ఉంటుంది. ఆర్కిటిక్‌ వలయం పరిధిలోని కొన్ని ఊళ్లలో చలికాలాల్లో రోజుల తరబడి రాత్రే ఉంటుంది. నెలలు గడిచినా సూర్యోదయం కాదు. ఈ ప్రాంతంలోని ఒక ఊళ్లో రెండు నెలల పాటు రాత్రి ఉంటే, మరో ఊళ్లో నాలుగు నెలలూ చీకటే ఉంటుంది.

Polar Night : ఆ ఊళ్లో నాలుగు నెల‌లపాటు రాత్రే.. నెల‌లు గ‌డిచినా సూర్యుడు రాని ప్రాంతాలివే!

polar night (1)

Polar Night : సాధారణంగా ఒక రోజులో సగం పగలు మిగిలిన సగం రాత్రిగా ఉంటుంది. ప్రతి రోజు సూర్యోదయం అవుతుంది. అయితే వర్షాకాలం, తుఫాన్ సందర్భంగా మనకు రెండు, మూడు రోజులు సూర్యోదయం కనిపించదు. కానీ ఆ ఊళ్లో నాలుగు నెలలపాటు రాత్రే ఉంటుంది. ఆర్కిటిక్‌ వలయం పరిధిలోని కొన్ని ఊళ్లలో చలికాలాల్లో రోజుల తరబడి రాత్రే ఉంటుంది. నెలలు గడిచినా సూర్యోదయం కాదు. ఈ ప్రాంతంలోని ఒక ఊళ్లో రెండు నెలల పాటు రాత్రి ఉంటే, మరో ఊళ్లో నాలుగు నెలలూ చీకటే ఉంటుంది.

చలికాలం వచ్చిందంటే చాలు, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా… ఎప్పుడెప్పుడు ఎండ వేడికి చలి కాచుకుందామా అన్నట్టుగా ఉంటుంది. సూర్యోదయం కోసం మన ఎదురుచూస్తాం. కానీ నీళ్లు గడ్డకట్టుకుపోయే చలి ఉండే ఆ ప్రాంతాల్లో శీతాకాలాల్లో సూర్యుడి జాడే కనిపించదు. కాసేపైనా ఎండ దుప్పటి కప్పుకుని తిరిగే అవకాశమే వాళ్లకు దొరకదు. ‘పోలార్‌ నైట్‌’ గా పిలిచే ప్రకృతి వైచిత్రే దీనికి కారణం. ఒక రాత్రి 24 గంటల పాటు ఉంటే దాన్ని పోలార్‌ నైట్‌గా పిలుస్తారు.

village’Built its own sun’: 3నెలలు సూర్యుడు ఉదయించని గ్రామం..వెలుగు కోసం ‘కొత్త సూర్యుడి’ సృష్టి

భూమి తన అక్షం మీద ఇరవై మూడున్నర డిగ్రీలు వంగి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందువల్ల ధ్రువాల దగ్గర ఉండే ఆర్కిటిక్‌ వలయం ప్రాంతంలోని కొన్ని ఊళ్లలో శీతాకాలం సూర్యుడి కాంతి ప్రసరించదు. ఆర్కిటిక్‌ వలయానికి ఆయా ఊళ్లు ఉన్న దూరాన్ని బట్టి ఆ ప్రదేశాల్లో ఏర్పడే రాత్రుల్లో తేడా ఉంటుంది. స్వీడన్‌, కెనడా, గ్రీన్‌ల్యాండ్‌, రష్యా, నార్వే, ఫిన్లాండ్‌ దేశాలు సహా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా పోలార్‌ నైట్‌లు ఏర్పడతాయి.

సుదీర్ఘంగా సాగే ఈ రాత్రులు కొన్ని ప్రాంతాల్లో నెలలపాటు ఉంటాయి. అందులో అత్యంత ప్రాచుర్యం పొందిన నగరం.. అమెరికా దేశం అలాస్కా రాష్ట్రానికి చెందిన ఉట్‌కియాగ్విక్‌. మంచు కొండల మధ్య పొందికగా పేర్చినట్టుండే ఈ ఊళ్లో నవంబర్‌ 15 నుంచి 19 మధ్య కాలం వరకే సూర్యుడు కనిపిస్తాడు. తర్వాత మళ్లీ జనవరి 20 తర్వాతే ఉదయిస్తాడు. అంటే దాదాపు రెండు నెలలు అక్కడ సూర్యోదయం కాదు. గతేడాది 65 రోజులకు పైగా సూర్యుడు దర్శనమే ఇవ్వలేదు.

24 Hours Sun : అక్కడ రాత్రి అనేదే ఉండదు..అర్థరాత్రి కూడా సూర్యుడు కనిపించే ప్రాంతం..!!

అలాగే నార్వే దేశంలోని ‘ట్రాంసో’ మున్సిపాలిటీ ప్రాంతంలో నవంబర్‌ చివరివారం నుంచి జనవరి మధ్య వరకూ సుదీర్ఘరాత్రి కొనసాగుతోంది. నార్వేలోని స్వాల్‌బార్డ్‌లోనూ అక్టోబర్‌ తొలివారం నుంచి ఫిబ్రవరి చివరి వరకూ.. అంటే దాదాపు 4 నెలలు రాత్రి మాత్రమే ఉంటుంది. అందులోనూ నవంబర్‌ మధ్యకాలం నుంచి దాదాపు రెండున్నర నెలలు ఈ ప్రాంతంలో చిమ్మచీకటి కమ్ముకుని ఉంటుంది. అయితే ఒక్క స్వాల్‌బార్డ్‌ మినహా మిగతా ప్రాంతాల్లో చీకటి అంటే మనకు మధ్యరాత్రిలాగా కటిక చీకటి ఉండదు.

చంద్రుడూ, అధిక సంఖ్యలో ఉండే నక్షత్రాల వెలుతురుతో పాటు ఆకాశంలోని కాంతి నీళ్ల మీద పరావర్తనం చెంది.. సందెపొద్దును తలపించేలా అందమైన నీలి రంగు కాంతి దర్శనమిస్తుంది. మంచు, నీళ్లు ఉన్న ప్రాంతాలన్నీ ఇలా నీలివర్ణంలో ముంచినట్టు అద్భుతంగా మెరిసిపోతూ దర్శనమిస్తాయి. వీటికి తోడు అయనోస్పియర్‌లో సౌరవాయువులకు చెందిన అయాన్లు భూ వాతావరణంలోని ఆక్సిజన్‌, నైట్రోజన్‌ అణువులను ఢీకొట్టిన కారణంగా ఆ ప్రాంతంలో రంగురంగుల్లో దర్శనమిచ్చే అరోరా బొరియాలిస్‌ కూడా కనువిందు చేస్తాయి. వీటన్నిటినీ కెమెరాలో బంధించడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రకృతి ప్రియులు వస్తారు. సుదీర్ఘమైన రాత్రుల్ని అనుభూతి చెందుతారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.