G20: ప్రధాని మోదీకి సెల్యూట్ చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

వాస్తవానికి రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనడంపై అమెరికా మొదట అభ్యంతరం తెలిపింది. అయితే తమ దౌత్య విధానాల్లో వేలు పెట్టొద్దని, తమ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రవర్తించొద్దని భారత్ గట్టి హెచ్చరిక చేయడంతో అమెరికా వెనక్కి తగ్గింది. అనంతరం ఇండియా విధానాలను తప్పుబట్టబోమంటూ వైట్ హౌస్ ప్రకటన చేయడం గమనార్హం.

G20: ప్రధాని మోదీకి సెల్యూట్ చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

President Biden's 'Salute' To PM Modi At G20

G20: ఇండోనేషియాలోని బాలిలో జరుగుతోన్న జీ-20 సమ్మిట్‭లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కుర్చీలో కూర్చుని వివిధ దేశాల ప్రతినిధులతో ముచ్చటిస్తుంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెల్యూట్ చేశారు. ప్రతిగా నరేంద్రమోదీ ఒంటి చేత్తో అభివాదం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

జీ-20 సమ్మిట్‭లో పాల్గొన్న వివిధ దేశాధినేతలు, ప్రతినిధులు తాజాగా బాలిలోని మాంగ్రోవ్ అడవీ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడికి మోదీ సహా వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులు ముందుగానే చేరుకుని, కూర్చుని మాట్లాడుతున్నారు. ఇంతలో అమెరికా అధినేత జో బైడె అక్కడికి వచ్చారు. నేరుగా మోదీ వద్దకే వస్తున్న ఆయన.. మోదీ తనవైపు చూడగానే సెల్యూట్ చేశారు. అనంతరం మోదీ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు.

వీడియో ప్రకారం.. మొదట బైడెన్ రాకడను మోదీ గమనించలేదు. చూడగానే ఆయనకు బైడెన్ కనిపించగానే షేక్ హ్యాండ్ ఇచ్చి, కౌగిళించుకున్నారు. ఇరు దేశాధినేతల మధ్య కొంత సేపు చర్చ జరిగింది. బెడెన్ తన కుర్చీ వైపు వెళ్తుండగా.. మోదీ ఏదో అన్నారు (బహుశా ఏదో జోక్ వేసుంటారు). దీంతో బైడెన్ నవ్వుతూ తన కుర్చీ వద్దకు వెళ్లడం చూడొచ్చు.

కొద్ది రోజుల క్రితం, రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనడంపై అమెరికా మొదట అభ్యంతరం తెలిపింది. అయితే తమ దౌత్య విధానాల్లో వేలు పెట్టొద్దని, తమ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రవర్తించొద్దని భారత్ గట్టి హెచ్చరిక చేయడంతో అమెరికా వెనక్కి తగ్గింది. అనంతరం ఇండియా విధానాలను తప్పుబట్టబోమంటూ వైట్ హౌస్ ప్రకటన చేయడం గమనార్హం.

G20 summit..Rishi Sunak : ‘రష్యా చేసేది అనాగరిక యుద్ధం..ఈ సదస్సుకు పుతిన్ వచ్చి ఉంటేనా..’ అంటూ రష్యా మంత్రి ఎదుటే రిషి సునక్ ఘాటు వ్యాఖ్యలు