Australia Quad meeting: జో బిడెన్ రానన్నారు.. క్వాడ్ సమావేశాన్ని రద్దు చేసిన ఆస్ట్రేలియా.. ఎందుకంటే?

2017 నవంబర్‌లో భారత్, జపాన్, యూఎస్, ఆస్ట్రేలియా దేశాలు సభ్యులుగా క్వాడ్ ప్రారంభమైంది. ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశాలు జరిగాయి. మూడో సమావేశం ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉంది. కానీ, ఈ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని తెలిపారు.

Australia Quad meeting: జో బిడెన్ రానన్నారు.. క్వాడ్ సమావేశాన్ని రద్దు చేసిన ఆస్ట్రేలియా.. ఎందుకంటే?

Quad Summit 2023

Quad Summit 2023: క్వాడ్రిలెటరల్ సెక్యూరిటీ డైలాగ్ లీడర్స్ సమ్మిట్ (క్వాడ్) ఈ నెల 24న ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉంది. క్వాడ్‌లో సభ్య‌దేశాలైన భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ ప్రధాని కిషిడా ఫుమియో, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. అయితే, మే 19 నుంచి 21 వరకు జపాన్ లో జరిగే జీ7 లీడర్స్‌ సమావేశంకు హాజరైన తరువాత మూడవ సారి జరిగే క్వాడ్ లీడర్స్ సమావేశానికి జో బిడెన్ పాల్గొంటారని గతంలో వైట్ హౌస్ ప్రకటించింది. తాజాగా వాషింగ్టన్‌లో రుణ పరిమితి చర్చల కారణంగా జో బిడెన్ ఆస్ట్రేలియాలో జరిగే క్వాడ్ సమావేశంకు హాజరు కావడం లేదని వైట్ హౌస్ ప్రకటించింది.

Quad Summit 2023: చైనాకు షాకిచ్చిన అమెరికా.. క్వాడ్‌లో కొత్త దేశాలకు ప్రవేశం లేదు..

అమెరికా అధ్యక్షుడు క్వాడ్ మీటింగ్‌లో పాల్గొనడం లేదని ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే సిడ్నీలో జరగాల్సిన క్వాడ్ సమ్మిట్‌ను రద్దు చేస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ బుధవారం చెప్పారు. అయితే, ఈనెల 19 నుంచి జపాన్ దేశంలోని హిరోషిమాలో జరిగే జీ7లో ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, ఇండియా, జపాన్ నాయకులు సమావేశమవుతారని అల్బనీస్ చెప్పారు. సిడ్నీలో ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక కార్యక్రమం వచ్చేవారం యథావిధిగా కొనసాగుతుందని ఆస్ట్రేలియా ప్రధాని అన్నారు. జపాన్‌లో జరిగే జీ7 దేశాల సమావేశంలో క్వాడ్ నాయకుల మధ్య చర్చను జరుపుతామని ఆయన మీడియాకు వెల్లడించారు.

Quad summit 2022: PM Modi : ప్రధాని మోడీ జపాన్ పర్యటనపైనే ప్రపంచ దేశాల దృష్టి.. ఎందుకంటే..

2017 నవంబర్‌లో భారత్, జపాన్, యూఎస్, ఆస్ట్రేలియా దేశాలు సభ్యులుగా క్వాడ్ ప్రారంభమైంది. దీని ప్రధాన ఉద్దేశం.. ఇండో – పసిఫిక్‌లోని క్లిష్టమైన సముద్ర మార్గాలను ఎటువంటి ప్రభావం లేకుండా ఉంచడానికి, కొత్త వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి, దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న ప్రతిపాదనలకు కార్యరూపం దాల్చటానికి ఏర్పాటయింది. క్వాడ్ మొదటి సమావేశం 2021లో అమెరికాలో వర్చువల్ ఫార్మాట్‌లో జరిగింది. ఆ తరువాత 2022లో జపాన్‌లోని టోక్యాలో జరిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మే 24న మూడో క్వాడ్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఈ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని చెప్పారు.