Quad Summit 2023: చైనాకు షాకిచ్చిన అమెరికా.. క్వాడ్‌లో కొత్త దేశాలకు ప్రవేశం లేదు..

మొదటి రెండు క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌ను యూఎస్, జపాన్ నిర్వహించాయి. మూడో సమ్మిట్‌ మే24న ఆస్ట్రేలియాలో జరగనుంది.

Quad Summit 2023: చైనాకు షాకిచ్చిన అమెరికా.. క్వాడ్‌లో కొత్త దేశాలకు ప్రవేశం లేదు..

Quad Summit 2023

Quad Summit 2023: క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (QUAD) లీడర్స్ సమ్మిట్ మే 24న ఆస్ట్రేలియాలో జరగనుంది. 2017 నవంబర్‌లో భారత్, జపాన్, యూఎస్, ఆస్ట్రేలియా దేశాలు సభ్యులుగా క్వాడ్ ప్రారంభమైంది. దీని ప్రధాన ఉద్దేశం.. ఇండో – పసిఫిక్‌లోని క్లిష్టమైన సముద్ర మార్గాలను ఎటువంటి ప్రభావం లేకుండా ఉంచడానికి, కొత్త వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి, దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న ప్రతిపాదనలకు కార్యరూపం దాల్చటానికి ఏర్పాటయింది. క్వాడ్ మొదటి సమావేశం 2021లో అమెరికాలో వర్చువల్ ఫార్మాట్‌లో జరిగింది. ఆ తరువాత 2022లో జపాన్‌లోని టోక్యాలో జరిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మే 24న మూడో క్వాడ్ సమావేశం జరగనుంది.

IPL 2023: మళ్లీ రచ్చరచ్చ చేశారు.. గంభీర్, కోహ్లీ మధ్య తీవ్ర వాగ్వాదం.. అడ్డుకున్న ఇరు జట్ల సభ్యులు .. వీడియోలు వైరల్

ఆస్ట్రేలియాలో మే 24న జరిగే సమావేశంకు.. క్వాడ్‌లో సభ్య దేశాలైన ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ ప్రధాని కిషిడా ఫుమియో, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ ఆల్బనీస్ పాల్గొంటారు. మే 19 నుంచి మే 21 వరకు జపాన్‌లో జరిగే జీ7 లీడర్స్‌కు హాజరైన తర్వాత మూడవ సారి జరిగే క్వాడ్ లీడర్స్ మీట్‌లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆస్ట్రేలియాకు చేరుకుంటారని వైట్‌హౌస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Tirumala High Alert : తిరుమలలో హైఅలర్ట్.. ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం

క్వాడ్ సభ్య దేశాల ప్రధాన శత్రువు చైనా. ఇండో – పసిఫిక్ సముద్ర ప్రాంతంలో చైనా ఆధిపత్యంకోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో క్వాడ్ సభ్య దేశాల ప్రతినిధుల మూడో సమావేశం జరగుతుంది. ఈ సమావేశంలో వాతావరణం, గ్లోబల్ హెల్త్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, తదితర అంశాలపై చర్చ జరుగుతుంది. ఇండో – పసిఫిక్ భాగస్వాముల సహాయంతో ప్రాంతం చుట్టూ ఆధునిక సముద్ర డొమైన్ అవగాహన కింద సాంకేతికను అందించడానికి కృషి చేస్తోంది. ఇది చైనాకు మింగుడుపడని అంశంగా మారింది.

Quad summit 2022: PM Modi : ప్రధాని మోడీ జపాన్ పర్యటనపైనే ప్రపంచ దేశాల దృష్టి.. ఎందుకంటే..

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ – పీయర్ మాట్లాడారు.. క్వాడ్ రెండేళ్ల క్రితం స్థాపించబడిందని అన్నారు. క్వాడ్ ఇప్పటికీ చాలా యువ భాగస్వామ్య దేశం అన్నారు. ప్రస్తుతం క్వాడ్‌లోకి కొత్త సభ్యులను చేర్చుకొనే ప్రణాళికలు లేవని తెలిపారు. క్వాడ్ సభ్యులు ప్రస్తుతానికి క్వాడ్ యొక్క అనేక బలాలను బలోపేతం చేయడంపై దృష్టిసారించాలని అంగీకరించారని తెలిపారు. విస్తృత శ్రేణి ఇండో – పసిఫిక్ భాగస్వాములతో కలిసి పనిచేసే అవకాశాలను క్వాడ్ స్వాగతిస్తున్నట్లు జీన్ పీయర్ చెప్పారు.