COVID-19 Effect: కొవిడ్ ఎఫెక్ట్.. వింత సమస్యతో రెండు నెలలుగా మలద్వారం..

కొవిడ్-19 ఎఫెక్ట్ అతనికి విశ్రాంతి లేకుండా చేసింది. మలద్వారం వద్ద భరించలేనంత నొప్పి బాధిస్తుండగా.. 77ఏళ్ల వ్యక్తి ట్రీట్మెంట్ కోసం టోక్యో మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్ లో చేరారు.

COVID-19 Effect: కొవిడ్ ఎఫెక్ట్.. వింత సమస్యతో రెండు నెలలుగా మలద్వారం..

Leg Pain Syndrome

COVID-19 Effect: కొవిడ్-19 ఎఫెక్ట్ అతనికి విశ్రాంతి లేకుండా చేసింది. మలద్వారం వద్ద భరించలేనంత నొప్పి బాధిస్తుండగా.. 77ఏళ్ల వ్యక్తి ట్రీట్మెంట్ కోసం టోక్యో మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్ లో చేరారు.

దగ్గుతో పాటు ఓ మాదిరి జ్వరంగా అనిపించడంతో పరీక్షలు చేశారు. రిజల్ట్స్‌లో కొవిడ్ పాజిటివ్ వచ్చింది. తర్వాత 10రోజులు హాస్పిటల్ లో మానిటరింగ్ లో ఉండగా న్యూమోనియో కూడా అటాక్ అయినట్లు వైద్యులు చెప్పారు. తేలికపాటి లక్షణాలే కనిపించడంతో ఆక్సిజన్ అవసరం కాలేదు.

అసలు సమస్యల్లా అసాధారణంగా మలద్వారం కింది ప్రాంతంలో వచ్చే విపరీతమైన నొప్పి. అదే అతనికి నిద్రలేకుండా చేసింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వారాలు దాటినా సమస్య తగ్గడం లేదు. perineal region అంతా 10సెంటీమీటర్ల మేర తట్టుకోలేనంత సమస్యతో బాధపడ్డాడు.

………………………… : ఎట్టకేలకు బయటకి వచ్చిన పోసాని

కాళ్లు కదిపినప్పుడు, అడుగేటప్పుడు ఒక్కోసారి తొడల భాగంలో పట్టుకుపోయేదట. రాత్రులు మలద్వారం మరింత నొప్పిగా ఉండటంతో నిద్రకూడా వచ్చేది కాదు. నిద్రమాత్రలు మింగితే కానీ, నిద్ర వచ్చేది కాదని చెప్తున్నాడు.

ఇతనికి వచ్చిన లెగ్ సిండ్రోమ్ తో మోచేతులు, కడుపు భాగం, ముఖం, తల, ఓరల్ క్యావిటీ, మూత్రాశయం, జననాంగం భాగాల్లో నొప్పిగా ఉండేది. దురదృష్టవశాత్తు న్యూరోసెప్టిక్ కండీషన్స్ దారుణంగా మారడంతో శాశ్వత పరిష్కారం లేకపోయినా వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నాడు.