Rhino Virus: కరోనాను అంతం చేసే మరో వైరస్..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. భారత్ లో దీని ప్రభావం అధికంగా ఉంది. రోజుకు మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనాను నియంత్రించేందుకు శాస్త్రవేత్తలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

Rhino Virus: కరోనాను అంతం చేసే మరో వైరస్..

Rhino Virus

Rhino Virus: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. భారత్ లో దీని ప్రభావం అధికంగా ఉంది. రోజుకు మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనాను నియంత్రించేందుకు శాస్త్రవేత్తలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక వ్యాక్సిన్స్ కనిపెట్టారు. కరోనాకు ట్యాబ్లేట్ తీసుకొచ్చేందుకు పరిశోధనలు చేస్తున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే మరో శుభవార్త చెప్పారు శాస్త్రవేత్తలు, కరోనా వైరస్ తో రినోవైరస్ సమర్థవంతంగా పోరాడుతుందని పరిశోధనల్లో తేల్చారు. జలుబు కారణమయ్యే రినోవైరస్ తో కరోనాను జయించవచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇది సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత కోవిడ్-19 వైరస్‌తో పోరాడుతోందని, కరోనా వైరస్ ను అంతం చేస్తుందని పరిశోధనల్లో తేలినట్లు పేర్కొంది.

పరిశోధన విషయానికి వస్తే

గ్లాస్గోలోని సెంటర్ ఫర్ వైరస్ రీసెర్చ్‌లోని బృందం కరోనా నివారణపై పరిశోధనలు చేసింది. మానవ శ్వాసకోశ వ్యవస్థలోకి రినో వైరస్, కరోనా వైరస్ లను ఒకే సారి చొప్పించారు. ఈ ప్రయోగంలో కరోనా వైరస్.. రినో వైరస్ ను అడ్డుకోలేకపోయింది. దీంతో రినో వైరస్ శరీరంలోకి చేరినప్పుడు ఇది కరోనాతో సమర్ధవంతంగా పోరాడుతుందని పరిశోధకులు తేల్చారు.

రినో వైరస్ గురించి

రినో వైరస్ జలుబుకు రావడానికి సాధారణ కారకం. ఇది ప్రతి జీవిలోను ఉంటుంది. ఎగువ శాశ్వకోస వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ఏడాది పొడవునా కనిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ వైరస్ కు మందులతో పనిలేదు. దీనిని శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ వారం రోజుల్లో నయం చేస్తుంది. ఈ వైరస్ కు స్వైన్ ఫ్లూ ను అడ్డుకునే శక్తి కూడా ఉందని 2009 జరిగిన పరిశోధనల్లో యూరోపియన్ పరిశోధకులు తెలిపారు.

ఈ వైరస్ తో జలుబు చేసిన వారికీ స్వైన్ ఫ్లూ సోకలేదని తెలిపారు. ఒకవేళ పరిశోధనలు పూర్తై కరోనాను రినో వైరస్ సమర్థవంతంగా ఎదురుకుంటే వైరస్ ను వైరస్ తోనే అంతం చేయగలుగుతాం.