Road Accident In Pakistan: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి, మరికొందరికి గాయాలు

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13మంది మరణించగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రయాణీకుల బస్సు, చెరుకులోడుతో వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.

Road Accident In Pakistan: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి, మరికొందరికి గాయాలు

Accident In Aravalli

Updated On : August 14, 2022 / 3:24 PM IST

Road Accident In Pakistan: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13మంది మరణించగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రయాణీకుల బస్సు, చెరుకులోడుతో వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. రెస్క్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం లాహోర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రహీమ్ యార్ ఖాన్ జిల్లాలో చెరకు లోడుతో వస్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 18మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తరువాత, రెస్క్యూ బృందాలు స్థానికులతో కలిసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి.

MP Crime : చెట్టుకు వేలాడుతున్న ముగ్గురు అక్కచెల్లెళ్ల మృతదేహాలు..హత్యలా? ఆత్మహత్యలా..?!

వారిలో 13మంది మరణించినట్లు ప్రకటించారు. మిగిలిన ఐదుగురు గాయపడగా, వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మృతులలో మహిళలు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన రహదారిపై వర్షపు నీరు చేరిందని అధికారులు తెలిపారు. ప్రమాదం తర్వాత చెరుకు గడల లోడు బస్సుపై పడిపోవటంతో సహాయక చర్యలు చేపట్టేందుకు కష్టతరంగా మారిందని, దీంతో మృతుల సంఖ్య పెరిగిందని పోలీసులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు.

Dalit boy beaten to death: రాజస్తాన్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాయావతి

ఇదిలాఉంటే పాకిస్తాన్ లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నాసిరకం మౌలిక సదుపాయాలు, శిథిలావస్థలో ఉన్న వాహనాలు, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం ఇలా పలు అంశాలు ప్రమాదాలకు పెరిగేందుకు కారణమవుతున్నాయి. 2020లో WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) డేటా రూపొందించింది. ఈ డేటా ప్రకారం.. పాకిస్తాన్‌లో రోడ్డు ప్రమాద మరణాలు మొత్తం మరణాలలో 1.93% అని పేర్కొంది.