Tokyo Olympics: పసిడి పరుగుల ఎలైన్..వరుసగా 2 ఒలింపిక్స్‌లో 2 బంగారు పతకాలు..

టోక్యో ఒలింపిక్స్ లో మహిళా అథ్లెట్లు కొత్త చరిత్రలు లిఖిస్తున్నారు. పోలాండ్‌ కు చెందిన ‘అనితా వొడార్జిక్‌’. వరుసగా మూడు ఒలింపిక్స్‌ లో పాల్గొని మూడు స్వర్ణ పతకాలు గెలుసుకుని కొత్త చరిత్ర సృషిచించారు. ఈ క్రమంలో జమైకాకు చెందిన మరో మహిళా అథ్లెట్ ఎలైన్‌ థాంప్సన్‌ హెరా చరిత్ర సృష్టించారు. వరుగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న ఎలైన్ రెండింటిలోను బంగారు పతకాలను సాధించిన ఏకైక మహిళా అథ్లెట్‌గా కొత్త చరిత్ర సృష్టించారు.

Tokyo Olympics: పసిడి పరుగుల ఎలైన్..వరుసగా 2 ఒలింపిక్స్‌లో 2 బంగారు పతకాలు..

Runner Elaine Thompson

Tokyo Olympics: Elaine Thompson New History Double Gold : టోక్యో ఒలింపిక్స్ లో మహిళా అథ్లెట్లు కొత్త చరిత్రలు లిఖిస్తున్నారు. పోలాండ్‌ కు చెందిన ‘అనితా వొడార్జిక్‌’. వరుసగా మూడు ఒలింపిక్స్‌ లో పాల్గొని మూడు స్వర్ణ పతకాలు గెలుసుకుని కొత్త చరిత్ర సృషిచించారు. ఈ క్రమంలో జమైకాకు చెందిన మరో మహిళా అథ్లెట్ ఎలైన్‌ థాంప్సన్‌ హెరా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. వరుగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న ఎలైన్ రెండింటిలోను బంగారు పతకాలను సాధించారు. టోక్యో ఒలింపిక్స లో మహిళల అథ్లెటిక్స్‌లో జమైకా అథ్లెట్‌ ఎలైన్‌ థాంప్సన్‌ హెరా 200 మీటర్ల ఫైనల్‌ రేసులో ఆమె విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. అలా వరుసగా రెండు ఒలింపిక్స్‌లో 100, 200 మీటర్ల విభాగాల్లో పసిడి పతకాలు గెలిచిన ఏకైక మహిళా అథ్లెట్‌గా కొత్త చరిత్ర సృష్టించారు ఎలైన్.

మంగళవారం (ఆగస్టు 3,2021) జరిగిన మహిళల 200 మీటర్ల ఫైనల్‌ రేసులో ఆమె విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా ‘స్ప్రింట్‌’ రేసుల్లో ‘డబుల్‌’ సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ ఎలైన్‌ 100, 200 మీటర్ల విభాగాల్లో బంగారు పతకాలు గెల్చుకోవటం విశేషం. ఫలితంగా వరుసగా రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణాలు నెగ్గిన ఏకైక మహిళా అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. పురుషుల విభాగంలో మాత్రం జమైకాకు చెందిన ఉసేన్‌ బోల్ట్‌ వరుసగా మూడు ఒలింపిక్స్‌ క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచాడు.

ఒలింపిక్స్‌లో స్ప్రింట్‌ రేసు అంటే అందరికీ ఠక్కున గుర్తుకువచ్చే పేరు ఉసేన్‌ బోల్ట్‌. పరుగుల్లో ఇతన్నీ దాటేవారే లేరు అన్నట్లుగా ఉంటుంది ఇతని వేగం. అంతలా స్ప్రింట్‌ రేసులను తన ప్రదర్శనతో అందరినీ ఫ్రీజ్ చేసేశాడు. ఈ క్రమంలో మహిళా ఉసేన్ బోల్ట్ లాగా పరుగుల్లో దూసుకుపోయింది టోక్యో ఒలింపిక్స్‌లో జమైకన్‌ మహిళా స్ప్రింటర్‌ ఎలైన్‌ థామ్సన్‌ హెరా.

ఒకవైపు స్ప్రింట్‌ రేసుల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన జమైకన్‌ పురుష అథ్లెట్లు విఫలమవుతుంటే… మహిళల విభాగంలో మాత్రం ఎలైన్‌ అదరగొట్టేసారు.గత నాలుగు రోజుల క్రితం మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన ఆమె మరోసారి స్వర్ణంతో మెరిసింది.

మంగళవారం జరిగిన 200 మీటర్ల పరుగులోనూ కేవలం 21.53 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా స్ప్రింట్‌ (100, 200 మీటర్లు) ఈవెంట్లను క్లీన్‌ స్వీప్‌ చేసింది. 2016 ‘రియో’లోనూ ఎలైన స్ప్రింట్‌ ఈవెంట్లను క్లీన్‌ స్వీప్‌ చయడం గమనించాల్సిన విషయం. ఇలా రెండు వరుస ఒలింపిక్స్‌ల్లోనూ 100, 200 మీటర్లలో స్వర్ణాలు సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా చరిత్రకెక్కారు ఎలైన్. క్రిస్టినే ఎమ్‌బోమా రజతం పతకం గెలుచుకోగా, అమెరికాకు చెందిన గాబ్రియేలా థామస్‌ కాంస్యం సొంతం చేసుకున్నారు.