కరోనా కేసుల్లో రష్యా రికార్డులు..ఒక్కరోజే 10వేలకు పైగా పాజిటివ్ కేసులు

  • Published By: venkaiahnaidu ,Published On : May 3, 2020 / 01:37 PM IST
కరోనా కేసుల్లో రష్యా రికార్డులు..ఒక్కరోజే 10వేలకు పైగా పాజిటివ్ కేసులు

పలు దేశాల్లో కరోనావైరస్ ఉద్ధృతి తగ్గనారంభిస్తుంటే మరికొన్ని దేశాల్లో మాత్రం పెరగడం మొదలైంది. రష్యాలో ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 10వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రష్యాలో ఒకే రోజు పెరుగుదలలో ఇది వరుసగా నాల్గవ రికార్డు. నాలుగురోజుల నుంచి రికార్డు స్థాయిల్లో కరోనా కేసులు నమోదవుతుంటం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు పెద్ద తలనొప్పిగా మారింది.

రష్యాలో ఆదివారం ఒకే రోజున 10,633 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ తాత్కాలిక ఆసుపత్రులు ప్రారంభించారు. మరోవైపు కొత్తగా నిర్ధరణ అవుతున్న కేసుల్లో సగానికిపైగా ఎలాంటి రోగ లక్షణాలు లేనివారే(asymptomatic)ఉన్నారని అధికారులు చెబుతున్నారు. రష్యాలో మొత్తం 134,687 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం కేసుల్లో సగానికి పైగా కేసులు ఒక్క రాజధాని మాస్కోలోనే నమోదయ్యాయి.

అయితే మరణాల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. రష్యాలో ఇప్పటివరకు 1280 కరోనా మరణాలు మాత్రమే నమోదయ్యాయి. గత 10 రోజుల్లోనే రష్యాలో కరోనా వైరస్ మరణాలు రెట్టింపయ్యాయి. రష్యాలో పెద్ద ఎత్తున టెస్టులు చేస్తుండడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క మాస్కోలోనే రోజుకు 40 వేల మందిని పరీక్షిస్తున్నారు. పరిస్థితి ఇంకా సీరియస్ గానే ఉందని అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. కరోనా మహమ్మారి యొక్క కొత్త మరియు కఠినశిక్ష దశను ఫేస్ చేయడబోతున్నట్లు పుతిన్ తెలిపారు. వైరస్ విశ్వరూపం ముందుందని ఆయన తెలిపారు. 

మరోవైపు రష్యాలో చాలామంది డాక్టర్లు వైరస్ బారిన పడటంతో క్వారంటైన్ కోసం 25కి పైగా హాస్పిటల్స్ ను మూసివేయడంతో ఆ దేశపు హెల్త్ కేర్ వర్కర్లలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. తగినంత రక్షణ లేకుండా కరోనా పోరాటంలో తమను ముందువరుసలో ఉండాలంటూ ఆదేశిస్తున్నారంటూ రష్యాలోని మెడికల్ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రష్యన్ ఇండిపెండెంట్ మీడియా మరియు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లు రిపోర్ట్ చేశాయి. అధికార యంత్రాంగం చర్యల వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది.

కాగా రష్యా ప్రధాన మంత్రి మిఖాయిల్ మిషూస్టిన్ కూడా కరోనావైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని గురువారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పుతిన్ కు తెలియజేశారు. అంతకుముందు రోజు ప్రధాని మిషూస్టిన్ మాట్లాడుతూ…దేశపు సరిహద్దులతో సహా రష్యాలో కరోనా ఆంక్షలను ఎత్తివేసే ఖచ్చితమైన తేదీని చెప్పలేమని తెలిపారు. మరోవైపు శనివారం రష్యా బోర్డర్ లోని ఓ చైనీస్ సిటీలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని రెస్టారెంట్లు మూసివేయాలని ఓ అత్యవసర ఎపిడమిక్ ప్రివెన్షన్ నోటీసును చేనా జారీ చేసింది.