Queen Elizabeth : క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియలకు ఆ మూడు దేశాలకు అందని ఆహ్వానం .. కారణం చాలా కీలకమే

క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియలకు ఆ మూడు దేశాలకు ఆహ్వానాలు పంపించలేదు బ్రిటన్.. దీని వెనుక కారణం అదేనంటోంది బ్రిటన్ మీడియా,

Queen Elizabeth : క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియలకు ఆ మూడు దేశాలకు అందని ఆహ్వానం .. కారణం చాలా కీలకమే

queens Elizabeth funeral

Queen Elizabeth : బ్రిటన్‌ రాణి ఎలిజబెత్ మరణంతో యావత్ ప్రపంచం నివాళులు అర్పిస్తోంది. గ్రేట్ బ్రిటన్ పాలనలో క్వీన్ ఎలిజబెత్ పాలన ఓ ప్రత్యేకంగా నిలిచింది. ఆమె పాలనలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆమె మరణానికి యావత్ ప్రపంచం ఘన నివాళులు అర్పిస్తోంది. అటువంటి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు కూడా చాలా ప్రత్యేకమే. రాయల్ కుటుంబ సంప్రదాయాల ప్రకారం ఈ అంత్యక్రియలు అత్యంత ఘనంగా జరుగనున్నాయి. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెతో సహా 500లమంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ప్రపంచంలోనే పలు దేశాలకు ఆహ్వానాలు పంపింది. కానీ మూడు దేశాలకు మాత్రం బ్రిటన్ ప్రభుత్వం ఆహ్వానాలు పంపిచలేదు. దీనికి చాలా కీలక కారణమే ఉంది.

Queen Elizabeth : రాణి ఎలిజబెత్ మరణం అన్నదమ్ములిద్దరినీ ఒక్కటి చేస్తుందా? ప్రిన్స్ విలియమ్స్, ప్రిన్స్ హ్యారీ తిరిగి కలిసిపోతారా?

సెప్టెంబర్ 19న జరుగనున్న క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు భారీ స్థాయిలో నిర్వహించటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ అంత్యక్రియల్లో ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. దీంట్లో భాగంగా ప్రపంచ దేశాలకు ఆహ్వానం పంపించిది బ్రిటన్ ప్రభుత్వం. కానీ ..రష్యా,బెలారస్‌,మయన్మార్‌ దేశాలను పక్కన పెట్టింది. వారికి ఆహ్వానాలు పంపించలేదు. ఎందుకంటే ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న రష్యాను బ్రిటన్ మొదటినుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. అలాగే రష్యాకు సన్నిహితంగా ఉంటోందని బెలారస్‌ ను పక్కన పెట్టింది బ్రిటన్ ప్రభుత్వం. ఈ రెండు దేశాలతో పాటు మయన్మార్‌ దేశాల ప్రతినిధులను మాత్రం ఆహ్వానించలేదు. అలాగే మయన్మార్ విషయానికొస్తే..మయన్మార్​లో అక్కడి సైన్యం తిరుగుబాటు చేసి అధికారం చేపట్టటం వంటి కారణాలతో మయన్మార్ కు కూడా ఆహ్వానం పంపించలేదని బ్రిటన్ మీడియో చెబుతోంది. అలాగే ఈ మూడు దేశాలతో బ్రిటన్‌ దౌత్య సంబంధాలు కొనసాగించేందుకు సుముఖంగా లేనట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

King Charles : తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణం .. కింగ్ చార్లెస్ పాలనపై సర్వత్రా ఆసక్తి..

క్వీన్‌ ఎలిజబెత్ II అంత్యక్రియలను సెప్టెంబర్‌ 19న భారీ స్థాయిలో నిర్వహించనుంది ప్రభుత్వం. దీని కోసం అత్యంత ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తోంది ప్రభుత్వం. 1965లో విన్‌స్టన్‌ చర్చిల్‌ మరణానంతరం ఈ స్థాయిలో చేస్తోన్న కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సహా ఆయా దేశాధినేతలు, రాజులు, రాణులు కలిపి మొత్తంగా 500 మంది వీఐపీలు హాజరుకానున్నట్లు సమాచారం.

క్వీన్ ఎలిజబెత్‌ అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, న్యూజిలాండ్‌, కెనడా, ఆస్ట్రేలియా ప్రధానమంత్రులు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా, జర్మనీ అధ్యక్షుడు స్టెయిన్మియర్‌లు హాజరుకానున్నారు. వీరి రాక ఇప్పటికే ఖరారయ్యింది. బెల్జియం, స్వీడన్‌, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌ దేశాల రాజులు, రాణులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. ఇలా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే అతిథులతో లండన్‌లోని బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో బ్రిటన్‌ రాజు చార్లెస్‌ ఆదివారం (సెప్టెంబర్ 19,2022 సాయంత్రం సమావేశమవుతారు. మరునాడు ఉదయం వెస్ట్‌మినిస్టర్‌ అబ్బే నుంచి విండ్సర్‌ క్యాజిల్‌లోని సెయింట్‌ జార్జ్‌ చాపెల్‌ వరకు క్వీన్‌ ఎలిజబెత్‌ అంతిమయాత్ర కొనసాగనుంది.

Queen Elizabeth : క్వీన్ ఎలిజ‌బెత్ మరణం .. ఆమె ముద్ర ఉన్న 95 బిలియ‌న్ల డాల‌ర్ల నోట్లు చెల్లుతాయా లేదా? బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఏం చెబుతోంది?

కాగా..క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు జరుగనున్న చారిత్రక వెస్ట్‌మినిస్టర్ అబే చర్చికి, రాణి ఎలిజబెత్‌కు ప్రత్యేక సంబంధం ఉంది. ఆమె వైవాహిక జీవితంలో ప్రారంభమైన ఈ చర్చిలోనే. అలా ఆమెు ఆఖరి మజిలీ పూర్తవుతుంది. వీరి వంశంలో చాలామంది వివాహాలు ఈ చర్చిలోనే జరిగాయి. అలా ఆ చర్చిలోనేక్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు జరుగనున్నాయి.

Queen Elizabeth Letter : సిడ్నీ ప్రజలకు క్వీన్ ఎలిజబెత్ రాసిన సీక్రెట్ లెటర్ .. 2085వ సంవత్సరంలో తెరవాలని నిబంధన