కొత్త మిత్రుడు పాక్‌ను పక్కనపెట్టేసిందా? : భారత్, అమెరికా, చైనాలకు రష్యా న్యూ ఇయర్ గ్రీటింగ్స్

కొత్త మిత్రుడు పాక్‌ను పక్కనపెట్టేసిందా? : భారత్, అమెరికా, చైనాలకు రష్యా న్యూ ఇయర్ గ్రీటింగ్స్

Russia ignores New-Friend Pakistan : కొత్త మిత్రుడు పాకిస్తాన్ ను రష్యా పక్కన పెట్టేసునట్టుంది. చూస్తుంటే అలానే కనిపిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. కొత్త మిత్రదేశం పాక్ మినహా మిగతా దేశాలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం, అమెరికా సహా ఇతర దేశాలకు ఆయన న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే? అధ్యక్షుడు పుతిన్ న్యూ ఇయర్ విషెస్ తెలియజేసిన దేశాల జాబితాలో పాక్ ఎక్కడా కనిపించలేదు. అంటే రష్యా పాక్‌ను పట్టించుకోలేదా? అనే సందేహం వ్యక్తమవుతోంది.

యాంటీ చైనా గేమ్స్ నేపథ్యంలో పాశ్చాత్య దేశాల చేత భారత్‌ ఒక వస్తువుగా మారిందంటూ రష్యా విమర్శలు గుప్పించింది. అనంతరం భారత్-రష్యా సంబంధాలపై పుతిన్ న్యూ ఇయర్ సందేశం ద్వారా ఇరుదేశాల మధ్య వైరాన్ని తగ్గించే ప్రయత్నించారు. నూతన సంవత్సర సందేశాన్ని పుతిన్.. చైనా, అర్మేనియా, అజర్‌బైజాన్, టర్కీ, ప్రధాన ప్రత్యర్థి అమెరికాతో సహా అనేక దేశాలకు పంపారు. ఆ జాబితాలో పాకిస్తాన్ మిస్ అయింది. పుతిన్ భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.


“రష్యా భారత్ ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలతో కొనసాగిస్తున్నాయి. 2020 ఏడాదిలో కరోనావైరస్ మహమ్మారితో సహా, అనేక సమస్యలు ఎదురైనప్పటకీ అభివృద్ధి చెందుతున్నాయని న్యూ ఇయర్ సందేశంలో పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు ఇరు దేశాలు గణనీయమైన రాజకీయ సంభాషణను కొనసాగిస్తాయని, వివిధ రంగాలలో ఉమ్మడి ప్రాజెక్టులను నిర్వహిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.