Russia population : 10 మంది పిల్లల్ని కంటే రూ.13 లక్షలు .. రష్యా అధ్యక్షుడు పుతిన్ బంపర్ ఆఫర్‌కు అసలు కారణం అదే..

10 మంది పిల్లల్ని కంటే రూ.13 లక్షలు ఇస్తాం అంటూ .. రష్యా అధ్యక్షుడు పుతిన్ మహిళలకు బంపర్ ఆఫర్‌ ప్రకటించారు. ఈ ఆఫర్ వెనుక ఉన్న అసలు కారణం ఏమిటంటే..

Russia population : 10 మంది పిల్లల్ని కంటే రూ.13 లక్షలు .. రష్యా అధ్యక్షుడు పుతిన్ బంపర్ ఆఫర్‌కు అసలు కారణం అదే..

Russia population is expected to drop to 11 crore by 2050

Russia population..putin offers money to women : దేశంలో పడిపోతున్న బర్త్ రేట్‌పై.. పుతిన్ ఆందోళన ఇప్పటిది కాదు. 2006లోనే.. దేశ జనాభా క్షీణించకుండా చర్యలు చేపట్టాలని.. పార్లమెంటును ఆదేశించారు. తగ్గుతున్న జనాభా.. రష్యాకు తీవ్రమైన సమస్య అని అప్పుడే చెప్పారు. ఇందుకోసం.. దంపతులు రెండో బిడ్డను కనేందుకు.. ప్రోత్సాహకాలు అందించాలని చెప్పారు. ఇప్పుడు.. ఏకంగా 10 మందిని కన్నవారికి.. క్రేజీ ఆఫర్ ప్రకటించారు. దేశ జనాభాపై.. పుతిన్‌కి.. ఇంత ఆందోళన ఎందుకు? రష్యా.. మనకన్నా.. చైనాకన్నా.. అతి పెద్ద దేశం. విస్తీర్ణం పరంగా.. ప్రపంచంలోనే.. అత్యంత పెద్ద దేశం. ఇండియా భౌగోళిక విస్తీర్ణం.. 32 లక్షల 87 వేల 263 చదరపు కిలోమీటర్లు ఉంటే.. రష్యా.. కోటీ 70 లక్షల 98 వేల 242 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. మన భారత్ జనాభా.. 130 కోట్లు ఉంటే.. రష్యా జనాభా మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇదే.. ఇప్పుడు ఆ దేశాన్ని కలవరపెడుతోంది. భారత్ కన్నా.. తక్కువ జనాభా ఉన్నందుకు కాదు.. దేశ విస్తీర్ణానికి.. దేశంలో ఉన్న జనాభాకు పోలిక లేనందున.

గత గణాంకాలు, ప్రస్తుత రిపోర్టులు చూసే.. పుతిన్ జనాభాపై ఇంతలా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా.. ఈ ఏడాది మార్చి తర్వాత.. అత్యధికంగా కరోనా కేసులు రిపోర్ట్ అవుతుండటంతో.. ఈ మదర్ హీరోయిన్ స్కీమ్‌‌ను ప్రకటించారు. అంతేకాదు.. యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో.. ఇప్పటివరకు రష్యా సైనికులు 50 వేల మంది దాకా మరణించి ఉంటారని చెబుతున్నారు. అయితే.. క్రెమ్లిన్ మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతోంది. కారణం ఏదైనా.. పెద్ద కుటుంబాల కోసం.. మహిళలను ప్రోత్సహించేందుకే ఈ స్కీమ్ ప్రకటించారని చెబుతున్నారు.

రష్యా జనాభా విషయానికొస్తే.. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయ్యే నాటికే.. దేశంలో 14 కోట్ల 80 లక్షల మంది జనాభాతో.. గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు రష్యా జనాభా 14 కోట్ల 40 లక్షలు. 2010లో.. అమెరికా సెన్సస్ బ్యారో అంచనా ప్రకారం రష్యా జనాభా 2050 నాటికి 11 కోట్ల 11 లక్షలకు తగ్గుతుందని రిపోర్ట్ ఇచ్చింది. 3 కోట్ల మంది కంటే ఎక్కువ జనాభా తగ్గిపోతుందని తెలిపింది. ప్రతీ సంవత్సరం రష్యా.. 7 నుంచి 8 లక్షల మంది తమ పౌరులను కోల్పోతోంది. ఇందుకు.. అధిక మరణాల రేటు, తక్కువ జననాల రేటు, అధిక అబార్షన్లతో పాటు వలసలు కూడా కారణంగా తెలుస్తోంది.

Also read : Russian Women : పది మంది పిల్లల్ని కంటే పదమూడు లక్షలు.. రష్యా మహిళలకు పుతిన్ ఆఫర్

అమెరికా సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ.. వరల్డ్ ఫ్యాక్ట్‌‌బుక్ ప్రకారం.. రష్యాలో ఏటా వెయ్యి మందికి.. 13.4 శాతం మరణాల రేటు ఉంటోంది. 2010లో.. అది 15 శాతంగా ఉండేది. అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు కాస్త తగ్గింది. కానీ.. ఇప్పటి ప్రపంచ సగటు మరణాల రేటు కంటే ఇది చాలా ఎక్కువ. రష్యాలో ఆల్కహాల్ సంబంధిత మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అధిక మరణాల రేటుతో.. రష్యన్ ప్రజల జీవనకాలం కూడా చాలా తక్కువగా ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. రష్యాలో పురుషుల జీవితకాలం 66 ఏళ్లుగా అంచనా వేసింది. అయితే.. మహిళల జీవితకాలం.. పురుషుల కంటే ఎక్కువగా 77 ఏళ్లుగా మెరుగ్గా ఉంది. ఇందుకు.. పురుషులు మద్యానికి బానిసలవడమే కారణంగా చూపుతున్నారు.

రష్యాలో నెలకొన్న పరిస్థితులతో.. మహిళలు కూడా పిల్లలను కనేందుకు తక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచ సంతానోత్పత్తి రేటు 2.4 శాతంగా ఉంటే.. రష్యా మహిళల సంతానోత్పత్తి రేటు ఒక్కొక్కరికి 1.6 శాతం కంటే తక్కువగా ఉంది. స్థిరమైన జనాభాను కొనసాగించేందుకు.. ప్రతి మహిళ సంతానోత్పత్తి రేటు 2.1 శాతంగా ఉంటే సరిపోతుంది. కానీ.. తక్కువ ఫెర్టిలిటీ రేటుతో.. క్షీణిస్తున్న జనాభాకు రష్యా మహిళలే కారణమంటున్నారు. సోవియట్ కాలంలో.. అబార్షన్‌ని సాధారణంగా భావించేవారు. పైగా.. జనన నియంత్రణ పద్ధతిగా చూసేవారు. కానీ.. ఇప్పుడు రష్యాలో ఆ పరిస్థితి లేదు. ప్రతి వెయ్యి మంది మహిళల్లో.. 480 మంది అబార్షన్‌ని ఎంచుకుంటున్నారు. చాలా మంది రష్యన్ మహిళలు.. అబార్షన్ ఒక్కటే జనాభా నియంత్రణకు మార్గంగా భావిస్తున్నారు. ఏటా దాదాపు 10 లక్షల మంది అబార్షన్‌కే మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు.. రష్యా జనాభాలో 72 శాతం మంది అబార్షన్ చట్టబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయ్.

Saudi Woman: ట్విట్టర్ వాడినందుకు సౌదీలో మహిళకు 34 ఏళ్ల జైలు శిక్ష

ఇలాంటి పరిస్థితులు నెలకొన్న రష్యాలో.. 13 లక్షల కోసం పది మంది పిల్లలను కని.. పెంచి పోషించాలని.. ఎవరు భావిస్తారు? పైగా ప్రభుత్వం ఇచ్చే రివార్డ్‌ పదో పిల్లాడు పుట్టిన ఏడాది తర్వాతే అందుతుంది. అప్పటి దాకా వారందర్నీ సాకడం చాలా కష్టమైన పని. ఆడవాళ్లు పూర్తిగా ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. అంతమందిని కనడానికి ఆరోగ్యమూ సహకరించాల్సి ఉంటుంది. అనుకున్నంత ఈజీ కాదు… ఈ స్కీమ్. ఎందుకంటే.. రష్యాలో అనేక ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలు ఉన్నాయి. కానీ.. 10 మంది పిల్లలను కన్నాక కూడా ఆ తల్లులకు మరింత సాయం, రాయితీల్లాంటివి అందిస్తామని ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. కేవలం మిలియన్ రూబుల్స్ కోసం 10 మంది పిల్లల్ని.. కనిపెంచడం సాధ్యమేనా అనే అనుమానాలు వస్తున్నాయ్. పుతిన్ ప్రభుత్వం తీసుకొచ్చిన.. మదర్ హీరోయిన్ స్కీమ్‌కు.. రష్యా మహిళలు ఎలా స్పందిస్తారన్నదే.. ఇప్పుడు ఆసక్తిగా మారింది.