Russian Women : పది మంది పిల్లల్ని కంటే పదమూడు లక్షలు.. రష్యా మహిళలకు పుతిన్ ఆఫర్

రష్యాలో జనాభా తగ్గిపోతుండటంపై అధ్యక్షుడు పుతిన్ ఆందోళన చెందుతున్నాడు. అందుకే జనాభా పెంచేందుకు ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం.. పది మంది పిల్లల్ని కన్న మహిళకు మన కరెన్సీలో రూ.13 లక్షల సాయం అందిస్తానని ప్రకటించాడు.

Russian Women : పది మంది పిల్లల్ని కంటే పదమూడు లక్షలు.. రష్యా మహిళలకు పుతిన్ ఆఫర్

Russian Women: రష్యాలో మహిళలకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ఆఫర్ ప్రకటించాడు. పది మంది పిల్లల్ని కన్న మహిళలకు మిలియన్ రూబుల్స్ (మన కరెన్సీలో రూ.13 లక్షలు) అందిస్తానని ప్రకటించాడు. అంతేకాదు.. ఆ తర్వాత కూడా మరింత సాయం అందిస్తామని వెల్లడించాడు. రష్యాలో కొంతకాలంగా జనాభా విపరీతంగా తగ్గిపోతోంది. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం వల్ల వేల మంది సైన్యాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అలాగే కరోనా వల్ల ఇంకొంతమంది ప్రాణాలు కోల్పోయారు.

Saudi Woman: ట్విట్టర్ వాడినందుకు సౌదీలో మహిళకు 34 ఏళ్ల జైలు శిక్ష

దీంతో దేశంలో జనాభా భారీగా తగ్గుతోందని గ్రహించిన పుతిన్.. తాజాగా ఒక ప్రభుత్వ పథకాన్ని ప్రకటించాడు. ‘మదర్ హీరోయిన్’ పేరుతో రూపొందించిన ఈ పథకం ప్రకారం పది మంది పిల్లల్ని కన్న మహిళకు, ఆ పిల్లలను పోషించేందుకు మిలియన్ రూబుల్స్ అందిస్తుంది ప్రభుత్వం. ఆ తర్వాత కూడా అనేక రకాలుగా సాయం, రాయితీ వంటివి అందుతాయి. అయితే, ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు కఠినమైన నిబంధనలు అమలు చేస్తారు. పదవ సంతానం కలిగిన తర్వాత.. ఆ సంతానానికి ఏడాది వచ్చిన తర్వాతే ఈ సాయం అందుతుంది. ఈ నగదు పొందే సమయానికి.. అంతకుముందు జన్మించిన తొమ్మిది మంది కూడా బతికే ఉండాలి. ఏ కారణంచేతనైనా, మిగతా తొమ్మిది మందిలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఈ పథకం వర్తించదు.

Madhya Pradesh: వివాహేతర సంబంధంపై గొడవ.. రైలు కింద ముగ్గురు కూతుళ్లను తోసేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

ఎక్కువ మంది పిల్లల్ని కన్నవాళ్లే తన దృష్టిలో నిజమైన దేశభక్తులు అని పుతిన్ భావిస్తాడని ఆయన ప్రతినిధులు అంటున్నారు. ఈ పథకం ద్వారా రష్యాలో మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపుతారని, దీని వల్ల తమ జనాభా పెరుగుతుందని రష్యా భావిస్తోంది. అయితే, ఇదంత సులభం కాదు. ప్రభుత్వం అందించే డబ్బులు అక్కడ పిల్లల్ని పెంచేందుకు సరిపోవు. పైగా పిల్లలు ఎక్కువగా ఉంటే వాళ్లు అనేక సామాజిక, ఆర్థిక పరమైన సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.