Madhya Pradesh: వివాహేతర సంబంధంపై గొడవ.. రైలు కింద ముగ్గురు కూతుళ్లను తోసేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

వివాహేతర సంబంధం విషయంపై కుటుంబ సభ్యులు నిందించడంతో మనస్థాపానికి గురయ్యాడో వ్యక్తి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు. అయిత, తనతోపాటు ముగ్గురు కూతుళ్లను కూడా చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.

Madhya Pradesh: వివాహేతర సంబంధంపై గొడవ.. రైలు కింద ముగ్గురు కూతుళ్లను తోసేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన ముగ్గురు కూతుళ్లను రైలు కింద తోసేసి, తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉజ్జైన్‌లోని నైఖేది స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవి పాంచాల్ అనే వ్యక్తి కార్పెంటర్‌గా పనిచేస్తుండేవాడు. అతడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే, రవికి ఈ మధ్య మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

Saudi Woman: ట్విట్టర్ వాడినందుకు సౌదీలో మహిళకు 34 ఏళ్ల జైలు శిక్ష

ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ఇటీవల రెండు రోజులపాటు ఇంటికి కూడా రాకుండా ఆమె దగ్గరే ఉన్నాడు. దీంతో రవి భార్య, ఆమె కుటుంబ సభ్యులు పంచాయితి నిర్వహించారు. ఈ విషయంలో రవిని తప్పుబట్టారు. వివాహేతర సంబంధం విషయంలో అందరూ కలిసి తనను తిట్టడంతో మనస్తాపానికి గురైన రవి.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తనతోపాటు కూతుళ్లను కూడా చంపాలనుకున్నాడు. ముగ్గురు కూతుళ్లను స్కూళ్లో దిగబెట్టేందుకు వారిని బైక్‌పై ఎక్కించుకున్నాడు. అయితే, స్కూల్ వైపు వెళ్లకుండా 12 కిలోమీటర్ల దూరంలోని రైలు పట్టాల వైపు వెళ్లాడు. పట్టాలపై గూడ్స్ రైలు వస్తుండగా, ముగ్గురు కూతుళ్లను పట్టాలపైకి తోసేశాడు. దీంతో రైలు కింద పడి ముగ్గురూ మరణించారు. తర్వాత తాను కూడా అదే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Jammu and Kashmir: స్థానికేతరులకు జమ్మూలో ఓటు హక్కు.. వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు

నలుగురు మృతదేహాలు రెండు ముక్కలై, చెల్లాచెదురుగా పడిపోయాయి. దూరం నుంచి కొందరు వ్యక్తులు ఈ ఘటనను ప్రత్యక్షంగా చూశారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. మరణించిన పిల్లలను అనామిక (16), అనుష్క (11), ఆరాధ్య (9)గా గుర్తించారు. మృతుడు రవి వద్ద ఒక సూసైడ్ నోట్ లభించింది. అందులో తన భార్య సోదరులు, కుటుంబ సభ్యులే ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నాడు. రైలు పట్టాలపక్కనే బైకు, పిల్లల స్కూల్ బ్యాగులు కూడా లభించాయి.