Jammu and Kashmir: స్థానికేతరులకు జమ్మూలో ఓటు హక్కు.. వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు

జమ్ము-కాశ్మీర్‌లో నివసించే ఇతర ప్రాంతాల వారికి కూడా అక్కడ ఓటు హక్కు కల్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ పనిచేసే కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు, భద్రతా సిబ్బంది.. ఇలా ఎవరైనా ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవచ్చు.

Jammu and Kashmir: స్థానికేతరులకు జమ్మూలో ఓటు హక్కు.. వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు

Jammu and Kashmir: జమ్మూ-కాశ్మీర్‌లో నివసించే స్థానికేతరులకు కూడా ఓటు హక్కు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయాన్ని అక్కడి ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. స్థానికేతరులకు జమ్మూలో ఓటు హక్కు కల్పిస్తూ జమ్మూ-కాశ్మీర్ ప్రధాన ఎన్నికల అధికారి హిర్దేష్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.

Ashwini Dutt : చిరంజీవే నాకు టీడీపీ ఎంపీ సీట్ ఇప్పించారు.. నేను కమ్యూనిస్ట్ ని కానీ..

దీని ప్రకారం.. అక్కడ నివసించే కూలీలు, ఉద్యోగులు, విద్యార్థులు సహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉంటున్న వారెవరైనా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్లు శాశ్వతంగా నివాసం ఏర్పర్చుకుని ఉండక్కర్లేదు. అలాగే జమ్మూలో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది కూడా ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవచ్చు. కొత్త ఓటర్ల నమోదు తర్వాత త్వరలో తుది జాబితా ప్రకటించనున్నారు. అయితే, ఈ నిర్ణయాన్ని జమ్ము-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల స్థానికులు అధికారం కోల్పోతారని, స్థానికేతరులు ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా ఫలితాల్ని బీజేపీ ప్రభావితం చేయాలనుకుంటోందని మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.

Saudi Woman: ట్విట్టర్ వాడినందుకు సౌదీలో మహిళకు 34 ఏళ్ల జైలు శిక్ష

ఇతర ప్రాంతాల నుంచి బీజేపీ ఓటర్లను రప్పించాలనుకుంటుంది అని ఆమె విమర్శించారు. ‘‘స్థానిక ఓటర్ల మీద నమ్మకం లేకపోవడం వల్లే బీజేపీ ఇతర ప్రాంతాల వారికి ఓటు హక్కు కల్పించాలనుకుంటుంది. ఇలా చేసి బీజేపీ గెలవాలని భావిస్తోంది’’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఓటర్ల వివరాలను వచ్చే నెల 15న ప్రకటిస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 25 వరకు ఏవైనా అభ్యంతరాలుంటే తెలపొచ్చు.