Russia New Law: అద్దె గర్భానికి తమ దేశ మహిళల్ని విదేశీయులు ఉయోగించుకోకుండా చట్టం చేస్తోన్న రష్యా
ఈ నూతన చట్టాన్ని వచ్చె నెల (డిసెంబర్) నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వోలోడిన్ తెలిపారు. కొద్ది సంవత్సరాలుగా దాదాపు సరోగసీ ద్వారా జన్మించిన 45,000 మంది పిల్లలు విదేశాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఇది పిల్లల అక్రమ రవాణా కిందకు వస్తుందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు

Russia to bar foreigners from using its surrogate mothers
Russia New Law: తమ దేశ మహిళలను విదేశీయులు అద్దె గర్భానికి ఉపయోగించుకోకుండా నిరోధించే చట్టాన్ని రష్యా త్వరలో ఆమోదించనుందని ఆ దేశ పార్లమెంటు దిగువ సభ స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోడిన్ చెప్పారు. నవంబర్ 27న రష్యా మాతృ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. వాస్తవానికి రష్యాలో పెయిడ్ సరోగసీ చట్టబద్ధమైందే. అయితే పిల్లల పుట్టుకను వ్యాపారం చేసుకోవడాన్ని కొన్ని మత సమూహాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చినట్లు సమాచారం.
Suvendu Vs Mamata: అంత దమ్ముంటే ఆపండి చూద్దాం.. మమతా బెనర్జీకి బీజేపీ ఓపెన్ ఛాలెంజ్
ఈ నూతన చట్టాన్ని వచ్చె నెల (డిసెంబర్) నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వోలోడిన్ తెలిపారు. కొద్ది సంవత్సరాలుగా దాదాపు సరోగసీ ద్వారా జన్మించిన 45,000 మంది పిల్లలు విదేశాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఇది పిల్లల అక్రమ రవాణా కిందకు వస్తుందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. ఈ ఏడాది మే నెలలో రష్యా చట్టసభ సభ్యులు మొదటి పఠనంలో ఈ బిల్లుకు దాదాపు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. చివరి మూడవ పఠనంలో ఆమోదించబడినట్లయితే, అది పార్లమెంటు ఎగువ సభచే సమీక్షించబడుతుంది. అనంతరం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకంతో చట్టంగా మారుతుంది.