Russia Ukraine War : హైపర్‌సోనిక్‌ మిస్సైల్‌తో దాడులను తీవ్రతరం చేసిన రష్యా

యుధ్ధం  మొదలై 25 రోజులు గడుస్తున్నా.. ఇంకా యుక్రెయిన్‌పై.. రష్యాకు పట్టు చిక్కలేదు. దీంతో.. దాడులను తీవ్రతరం చేసింది. యుద్ధంలో తొలిసారిగా హైపర్‌సోనిక్‌ మిస్సైల్‌తో దాడులకు దిగింది.

Russia Ukraine War : హైపర్‌సోనిక్‌ మిస్సైల్‌తో దాడులను తీవ్రతరం చేసిన రష్యా

Russia Ukraine cricis

Russia Ukraine War : యుధ్ధం  మొదలై 25 రోజులు గడుస్తున్నా.. ఇంకా యుక్రెయిన్‌పై.. రష్యాకు పట్టు చిక్కలేదు. దీంతో.. దాడులను తీవ్రతరం చేసింది. యుద్ధంలో తొలిసారిగా హైపర్‌సోనిక్‌ మిస్సైల్‌తో దాడులకు దిగింది. యుక్రెయిన్‌ వైమానిక, ఆయుధ స్థావరాలపై ఎటాక్ చేసింది. అటు ఖార్కివ్‌, మరియపోల్‌ ప్రాంతాల్లో భీకర పేలుళ్లు సంభవించాయి. మరోవైపు.. రష్యా దాడులను.. యుక్రెయిన్ సైన్యం, ప్రజలు గట్టిగా తిప్పికొడుతున్నారు. దీంతో.. రష్యా సేనలు డిఫెన్స్‌లో పడిపోతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.

యుక్రెయిన్‌పై దండెత్తిన రష్యా.. రోజురోజుకు దాడులను తీవ్రతరం చేస్తోంది. ఆ దేశంపై పట్టు కోసం.. హైపర్ సోనిక్ మిస్సైల్స్‌ని కూడా ప్రయోగిస్తోంది. ఖార్కివ్‌లో అపార్ట్‌మెంట్లపై రష్యా మిస్సైళ్లతో విరుచుకుపడింది. శిథిలాల కింద చాలా మంది సామాన్యులు చిక్కుకుపోయారు. వాళ్లందిరిని రక్షించేందుకు రంగంలోకి దిగారు అధికారులు.

అటు.. నికోలివ్‌ మిలటరీ ఎయిర్‌బేస్‌పై రష్యా రాకెట్ దాడి చేయగా.. 40 మంది చనిపోయారు. మృతి చెందిన వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. ఇక ఈ దాడిలో ఎయిర్‌బేస్‌ పూర్తిగా ధ్వంసమైంది. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. అందులో.. చిన్నారులు, వృద్ధులు ఉండడం తీవ్రంగా కలిచివేస్తోంది.

అటు లీవ్‌, ఖార్కీవ్, మరియపోల్‌లోనూ.. రష్యా మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. ఆస్పత్రులు, స్కూళ్లు, ప్రార్ధనామందిరాలు ఇలా.. అన్నింటిపైనా రష్యా దాడులను తీవ్రతరం చేసింది. యుక్రెయిన్‌ ప్రజలే లక్ష్యంగా.. రష్యా దాడులకు తెగబడుతున్నట్టు వార్తలొస్తున్నాయి.

రెండు రోజులుగా థియేటర్లు, స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్లపై విరుచుకుపడుతున్న రష్యా సేనలు.. పొలండ్‌కు సమీపంలోని లీవ్‌ నగరంపై క్షిపణులు, బాంబుల మోత మోగించడం.. మరింత ఆందోళన రేపుతోంది. ఇక.. యుక్రెయిన్ సరిహద్దుల్లోని యూరప్‌ దేశాలకు వలస వెళ్తున్న వేలాది మంది యుక్రెనియన్లు.. ప్రస్తుతం లీవ్‌లోనే తలదాచుకున్నారు.

అటు ప్రభుత్వ కార్యాలయాలు, రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లపైనా.. రష్యా బాంబుల మోత మోగిస్తోంది. మరోవైపు.. రష్యాను అడ్డుకునేందుకు యుక్రెయిన్ సైనికులు, ప్రజలు వీరుల్లా ముందుకు కదులుతున్నారు. యుక్రెయిన్‌ను రష్యా కైవసం చేసుకోకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆయుధాలు చేపట్టి.. రష్యా సైనికులకు చుక్కలు చూపిస్తున్నారు.
Also Read : Youtuber : రోడ్డు ప్రమాదంలో నటి మృతి-కొబ్బరి బోండాలలో ఆల్కహాలే కారణం ?
యుక్రెనియన్ల.. ప్రతిఘటనలో రష్యా భారీ నష్టాల్ని చవిచూస్తోంది. రష్యా సేనలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోన్న యుక్రెయిన్‌.. ఇప్పుడు రాజధాని కీవ్‌ సమీప ప్రాంతాలను తమ అధీనంలోకి తిరిగి తెచ్చుకుంది. మరోవైపు.. దేశ సమగ్రతను పునరుద్ధరించుకునే సమయం ఆసన్నమైందన్నారు యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.

జరిగిన నష్టాన్ని తగ్గించుకోవడానికి.. రష్యాకు ఉన్న ఏకైక మార్గం అర్థవంతమైన చర్చలేనన్నారు. చర్చలు ముందుకు సాగడం యుక్రెయిన్‌కు ఇష్టం లేదన్న రష్యా ఆరోపణల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక.. రష్యా అండర్‌లో ఉన్న 30 ప్రాంతాలను యుక్రెయిన్ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకోవడంతో.. రష్యా డిఫెన్స్‌లో పడిపోయింది. ఇక బ్లాక్‌ సీ నుంచి లీవ్‌పై క్షిపణులను ప్రయోగించిన రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు మిస్సైళ్లను నేలకూల్చామని యుక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది.