Russia-Ukraine war : రష్యాపై పోరాటానికి యుక్రెయిన్ జైళ్లనుంచి ఖైదీల విడుదల

రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌ కీలకనిర్ణయం తీసుకుంది. సైనిక నేపథ్యం ఉండి జైళ్లలో శిక్ష అనుభవిస్తోన్నవారిని,పలునేరాల్లో అనుమానితులుగా ఉన్నవారిని జైళ్లలో ఖైదీలుగా ఉన్నవారినివిడుదల

Russia-Ukraine war : రష్యాపై పోరాటానికి యుక్రెయిన్ జైళ్లనుంచి ఖైదీల విడుదల

Release Of Prisoners From Ukrainian Prisons To Fight Against Russia

Updated On : February 28, 2022 / 4:25 PM IST

Release of prisoners from Ukrainian prisons to fight against Russia : ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడుతున్న రష్యా సైన్యాన్ని సాధ్యమైనంత వరకు ఆపగలుగుతోంది యుక్రెయిన్. ఇప్పటికే తాము రష్యాకు చెందిన 5వేల 300లమంది సైనికులను హతమార్చామని తెలిపారు జెలెన్ స్కీ… 191 యుద్ధ ట్యాంకులు,816 సైనిక వాహనాలను,29 ఫైటర్ జెట్ లు,29 మెలికాప్టర్ లను కూల్చివేశామని జెలెన్ స్కీ వెల్లడించారు. అలా ఆర్మీతో పాటు సామాన్యులు కూడా రష్యా సైనికులపై తిరగబడుతున్నారు. పోరాడుతున్నారు. రష్యాతో పోరుకోసం వినూత్న విధానాలతో యుక్రెయిన్ పోరాటాన్ని కొనసాగిస్తోంది.

Also read : Russia-Ukraine war :.‘మా దేశం విడిచిపెట్టి ప్రాణాలు కాపాడుకోండి’ రష్యా సైనికులకు యుక్రెయిన్ అధ్యక్షుడు వార్నింగ్.

ఈక్రమంలో రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైనిక నేపథ్యం ఉండి జైళ్లలో శిక్ష అనుభవిస్తోన్న వారిని, పలు నేరాల్లో అనుమానితులుగా ఉన్నవారిని కూడా పోరాటానికి సన్నద్ధం చేస్తోంది. జైళ్లలో ఖైదీలుగా ఉన్నవారిని విడుదల చేస్తోంది.యుద్ధంలో భాగస్వామ్యం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది.జైళ్లలో ఉన్నా..వారి దేశం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో యుక్రెయిన్ ప్రభుత్వం జైళ్లనుంచి ఖైదీలను విడుదల చేస్తోంది. అలా విడుదల అయినవారు రష్యాపై పోరాటంలో చేరనున్నారు. ఈ విషయాన్ని నేషనల్ ప్రాసిక్యూటర్ జనరల్‌ కార్యాలయం ధ్రువీకరించింది.

కాగా ఉక్రెయిన్‌, రష్యా మధ్య ఏదో రోజు కూడా యుద్ధం కొనసాగుతోంది. రష్యా ఓ పక్క చర్చలు జరుపుదామంటూ బెలారస్ లో తగిన ఏర్పాట్లు చేసి మరోపక్క యుద్ధాన్ని మాత్రం ఆపకుండా కొనసాగిస్తూనే ఉంది. యుక్రెయిన్ సైనికులు కూడా ఏమాత్రం తగ్గకుండా రష్యాపై దాడులు చేస్తునే ఉన్నారు. ఐదో రోజు యుద్ధంలో రష్యా సోమవారం (ఫిబ్రవరి 28,2022) ఉదయం రాజధాని నగరం కీవ్‌, ప్రధాన నగరమైన ఖర్కీవ్‌లో పేలుళ్లలకు పాల్పడుతోంది.

Also read : Russia-Ukraine war : ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..యుక్రెయిన్ అంశాలపై 193 దేశాలు భేటీ..

ఇంకోపక్క కీవ్ ను రష్యా చేతుల్లోకి పోకుండా యుక్రెయిన్ అడ్డుకుంటోంది. కీవ్ మా అధీనంలో ఉందని యుక్రెయిన్ రక్షణశాఖ స్పష్టంచేసింది. కీవ్ ను ఎట్టి పరిస్థితుల్లోను రష్యాను ఆక్రమించుకోనివ్వమని తెగేసిచెబుతోంది. ఇప్పటికే యుక్రెయన్ దెబ్బకు రష్యా సైన్యం భయపడిందని మానస్థైర్యాన్ని కోల్పోయిందని రక్షణ శాఖ వెల్లడించింది.