Russia ukraine war : ఖార్కివ్ నగరంపై రష్యా ఫోకస్..ఆస్పత్రులపై రాకెట్ల దాడి

రాజధాని కీవ్‌ తర్వాత ఖార్కివ్‌ నగరంపై రష్యా సేన ఫోకస్‌ పెంచింది. ఖార్కివ్‌లోని మిలటరీ ఆస్పత్రి ముందు హోరాహోరిగా కాల్పులు జరుపుతోంది. పలు ఆస్పత్రులపై రాకెట్లతో దాడులు చేస్తోంది.

Russia ukraine war : ఖార్కివ్ నగరంపై రష్యా ఫోకస్..ఆస్పత్రులపై రాకెట్ల దాడి

Russian Airborne Troops Land In Ukraines Kharkiv Attack Local Hospital

Updated On : March 2, 2022 / 1:14 PM IST

Russian airborne troops land in ukraines kharkiv attack local hospital : ఏడవ రోజు కూడా యుక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగిస్తోంది. మరోపక్క యుక్రెయిన్ కూడా రష్యా దాడులను ఎదుర్కొంటోంది. యుక్రెయిన్‌ సైనికులు ఎదురుదాడికి దిగుతుండటంతో రష్యన్‌ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. యుక్రెయిన్ లో నగరాలపై టార్గెట్ చేసిన రష్యా దేశంలో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్‌ (Kharkiv)పై రష్యా యుద్ధవిమానాలు దాడికి దిగాయి.

మంగళవారం (మార్చి 2,2022) ఖార్కీవ్‌ నగర పరిపాలనా భవనం ఫ్రీడమ్‌ స్కేర్‌ను క్షిపణితో నేలమట్టం చేసిన రష్యన్‌ దళాలు.. మంగళవారం ఖార్కివ్ నగరంలోని ఆస్పత్రులపై రాకెట్లతో దాడికి దిగాయి.‘ఖార్కీవ్‌లోకి రష్యా వైమానిక దళాలు అడుగుపెట్టాయి అని..నగరంలోని ఆస్పత్రులపై దాడి చేస్తున్నాయని మేంకూడా దాడులను ప్రతిఘటిస్తన్నామని మా పోరాటం కొనసాగుతోంది’ అని యుక్రేనియన్‌ ఆర్మీ ప్రకటించింది.

Also read : Russia ukraine war : 64 కిలోమీటర్ల పొడవైన ఆయుధ కాన్వాయ్ తో కీవ్ వైపు దూసుకొచ్చిన రష్యా ఆర్మీ..

యుక్రెయిన్‌పై పోరులో ఓ పక్క చావు దెబ్బ తింటున్నా..రష్యా బలగాలు కూడా ఏమాత్రం తగ్గటంలేదు. మార్చి 1న నుంచి దాడుల విషయంలో గేర్‌ మార్చిన రష్యన్‌ ఆర్మీ.. ప్రధాన నగరాలపై నిరంతరంగా దాడులు కొనసాగిస్తోంది. దీంట్లో భాగంగా దేశ రాజధాని కీవ్‌ తర్వాత ఖార్కివ్‌ నగరంపై ఫోకస్‌ పెంచింది. ఖార్కివ్‌లోని మిలటరీ ఆస్పత్రి ముందు హోరాహోరిగా కాల్పులు జరుపుతోంది. ఇప్పటికే ఖార్కివ్ నగరంలో రష్యన్‌ పారాట్రూపర్స్‌ ల్యాండ్‌ అయ్యారు. రష్యా బలగాల దూకుడుతో ప్రజలంతా ఖార్కివ్‌ను వీడుతున్నారు. రష్యా దాడుల కారణంగా ఇప్పటికే 6 లక్షల మంది యుక్రెయిన్‌ ప్రజలు ఇతర దేశాలకు తరలిపోయారు.

Also read : Russia ukraine war : రష్యా యుద్ధ ట్యాంక్ ను ఎత్తుకుపోయిన యుక్రెయిన్ రైతు…లబోదిబోమన్న రష్యన్

ఖార్కివ్ నగరాన్ని హస్తగతం చేసుకోవడంలో మొదటి నుంచి పక్కా ప్లాన్‌ ప్రకారం వ్యవహరించాయి రష్యా బలగాలు. మొదట ఖార్కివ్‌ను నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టి.. ఆ తర్వాత రాకెట్లతో విరుచుకపడ్డాయి. నిన్న రాత్రి అన్ని వైపుల నుంచి చొచ్చుకొచ్చిన రష్యా బలగాలు.. తెల్లవారుజాము వరకు తమ ఆర్మీ వెహికల్స్‌ను నగరం నడిబొడ్డున పార్క్‌ చేశాయి. ఈ సమయంలో యుక్రెయిన్‌ ఆర్మీ నుంచి ప్రతిఘటన ఎదురైనా.. సునాయాసంగానే ఖార్కివ్‌ను చేజిక్కించుకుంది రష్యా.

Also read : Russia Ukraine War : రష్యాపై యుక్రెయిన్ ఫిర్యాదు.. మార్చి 7, 8న ఐసీజేలో విచారణ!

నగరంలో మారణ హోహాన్ని సృష్టిస్తోంది రష్యా సేన. ఇప్పటికే కీవ్ శివారు ప్రాంతమైన బోరోద్యాంకాలో విధ్యంసం సృష్టించింది. అలా దేశంలోని ప్రధాన నగరాలపై దాడులతో విరుచుకుపడుతోంది. దీంట్లో భాగంగానే రాకెట్లతో విరుచుకుపడుతు ఖార్కివ్ నగరాన్ని చేజిక్కించుకుంది రష్యా..