Russia-Ukraine war : యుక్రెయిన్ పై యుద్ధం ఆపాలంటూ డిమాండ్ చేస్తూ రష్యాలో నిరసనలు..వందలాది ఆందోళనకారులను అరెస్ట్

యుక్రెయిన్ పై విలయతాండవం చేస్తున్న రష్యాపై సొంత దేశ ప్రజలే వ్యతిరేకిస్తున్నారు.యుక్రెయిన్ పై యుద్దాన్ని ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు.దీంతో వందలాదిమందిని అరెస్ట్ చేస్తోంది ప్రభుత్వం

Russia-Ukraine war : యుక్రెయిన్ పై యుద్ధం ఆపాలంటూ డిమాండ్ చేస్తూ రష్యాలో నిరసనలు..వందలాది ఆందోళనకారులను అరెస్ట్

Protests In Russia Demanding To Stop War Against Ukraine

Protests in Russia demanding to stop war against Ukraine : యుక్రెయిన్ పై విలయతాండవం చేస్తున్న రష్యాపై సొంత దేశ ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. యుక్రెయిన్ పై యుద్దాన్ని ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. యుక్రెయిన్ పై యుద్ధం సరికాదంటూ ప్రపంచ దేశాలన్నీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కోరుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా మరింతగా విజృంభిచి యుక్రెయిన్ పై విలయతాండవం చేస్తోంది రష్యా సేన. ప్రపంచ దేశాలన్నీ మమ్మల్ని ఒంటరిని చేశాయని పాపం యుక్రెయన్ వాపోతోంది.అయినా ఏదేశం నుంచి స్పందన రావటంలేదు. తొలి రోజు యుద్ధంలో ఉక్రెయిన్ భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూసింది. బాంబులు, మిస్సైల్స్ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

Also read : Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్.. నిరంతర పేలుళ్లు.. 137మంది మృతి

ఇవన్నీ చూస్తున్న రష్యా ప్రజలు ‘పుతిన్ ఇక చాలు ఆపండి..యుక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపండీ అంటూ డిమాండ్ చేస్తున్నారు. ‘నో టు వార్’, ‘స్టాప్ వార్’, ‘పుతిన్ లైస్’ అనే నినాదంతో యుక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో రష్యా పోలీసులు నిరసన కారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిరసన గళాలని తొక్కిపారేస్తున్నారు. వందలాదిమందిని అరెస్ట్ చేసి సెల్ లో వేస్తున్నారు. అలా ఇప్పటి వరకు 1700మందికి పైగా నిరసనకారులను రష్యా పోలీసులు అరెస్ట్ చేశారు.

నిరసనకారులు మాస్కోతో పాటు దేశంలోని పలు నగరాల్లో రోడ్లెక్కారు. ‘నో టు వార్’, ‘స్టాప్ వార్’, ‘పుతిన్ లైస్’ అంటూ నినదిస్తున్నారు. నిరసనకారులపై రష్యా పోలీసులు ఉక్కుపాదం మోపుతూ 1700లమందికిపైగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని 51 నగరాల్లోని జైళ్లలో ఉంచారు. అరెస్టైన వారిలో 700కు పైగా నిరసనకారులు మాస్కోకు చెందిన వారు ..దాదాపు 340 మంది దేశంలో రెండో పెద్ద నగరమైన సెయింట్ పీటర్స్ బర్గ్ కు చెందినవారు.

Also read : Joe Biden : ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్యపై జో బైడెన్​ కీలక వ్యాఖ్యలు

దేశంలో అంతర్గతంగా ఉన్న తీవ్ర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఉక్రెయిన్ పై పుతిన్ యుద్ధం చేస్తున్నారని ఒక నిరసనకారుడు తన గళాన్ని వినిపించాడు. యుక్రెయిన్ పై యుద్ధాన్ని రష్యాలో కొన్ని మీడియాలో కూడా వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది మీడియాకు చెందిన ఒక వ్యక్తి మాటలద్వారా.. సదరు మీడియా వ్యక్తి మాట్లాడుతూ..‘ఒక హంతకుడు ఇచ్చే డబ్బును తీసుకుని అతనికి అనుకూలంగా పని చేయలేమని దేశాధ్యక్షుడు వాద్లమిత్ పుతిన్ ని ఉద్దేశించి విమర్శించారు. ఈ యుద్ధం వల్ల రష్యా అనేక వ్యతిరేక పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మరొక నిరసనకారుడు తెలిపాడు.

Also read : Ukraine : ప్రపంచం మమ్మల్ని ఒంటరి చేసింది, నమ్మించి నట్టేట ముంచారు.. యుక్రెయిన్ ఆవేదన

కాగా..రష్యా యుక్రెయిన్ పై యుద్ధానికి సన్నద్ధం అవుతున్నప్పటినుంచి అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నే ఉంది హెచ్చరిస్తునే ఉంది. దీనిపై పలు దేశాలు కూడా వ్యతిరేకత వ్యక్తంచేశాయి. రష్యాలో పలువురు నేతలకు కూడా ఈ యుద్ధాన్ని వ్యతిరేకించారు. అలా దేశంలో ఎక్కడ నిరసన గళం వినిపించినా పుతిన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూనే ఉంది. వారిని అరెస్ట్ జైళ్లలో పెట్టటమేకాదు..కొంతమందిని గుట్టు చప్పుడు కాకుండా హత్య చేసినట్లుగా కూడా పలువురు చెబుతున్నారు. అంతగా కాకపోతే దేశం నుంచి బహిష్కరించడమో చేస్తోంది రష్యా ప్రభుత్వం.నిరసన గళం వినిపించిన పలువురు ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితి రష్యాలో ఉందంటున్నారు. అలా ఎంతోమంది ఎంతో మంది ఆచూకీ లేకుండా పోయారని కొంతమంది తెలిపారు.