Russia-Ukraine War: యుక్రెయిన్‌పై యుద్ధంతో రష్యా వొడ్కాకు కష్టాలు..రష్యన్‌ లిక్కర్‌ని బ్యాన్‌ చేస్తున్న దేశాలు

యుక్రెయిన్‌పై యుద్ధం రష్యా లిక్కర్‌ కొంపముంచింది. యుక్రెయిన్‌పై రష్యన్‌ సైన్యం దాడులు చేయడాన్ని నిరసిస్తూ.. పశ్చిమ దేశాలు రష్యా ఓడ్కాను నిషేధించాయి.

Russia-Ukraine War: యుక్రెయిన్‌పై యుద్ధంతో  రష్యా వొడ్కాకు కష్టాలు..రష్యన్‌ లిక్కర్‌ని బ్యాన్‌ చేస్తున్న దేశాలు

Us And Canada Ban Russia Vodka

US and Canada ban Russia vodka: యుక్రెయిన్‌పై యుద్ధం రష్యా లిక్కర్‌ కొంపముంచింది. యుక్రెయిన్‌పై రష్యన్‌ సైన్యం దాడులు చేయడాన్ని నిరసిస్తూ.. పశ్చిమ దేశాలు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ఈక్రమంలో రష్యాకు మరో నష్టం వచ్చి పడింది. అదేమంటే ప్రపంచ వ్యాప్తంగా మాంచి ఫేమస్‌ అయిన రష్యన్‌ వోడ్కాను కూడా ఆయా దేశాలు నిషేధించాయి. ర‌ష్యన్ వోడ్కాను ఇక అమ్మం అంటూ యూఎస్‌, కెనడాలు ప్రకటించాయి. స్టోర్లలోని వోడ్కా బాటిల్స్‌ను తొలగించివేస్తున్నాయి.

న్యూ హాంప్‌షైర్‌లో రష్యన్‌ లో తయారైన బ్రాండెడ్ స్పిరిట్‌లను ప్రభుత్వ వైన్ మరియు మద్యం అవుట్‌లెట్ల నుంచి నిషేధించారు. ఒహియోలో కూడా రష్యన్ స్టాండర్డ్ వోడ్కా కొనుగోలును ఆపాలంటూ గవర్నర్ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై మాస్కో దాడిని ఖండిస్తూ కెనడియన్ మద్యం దుకాణాలు తమ షెల్ఫ్‌ల నుంచి రష్యన్ వోడ్కా మరియు ఇతర రష్యన్ తయారు చేసిన ఆల్కహాలిక్ పానీయాలను తొలగిస్తున్నాయి. మానిటోబా మరియు న్యూఫౌండ్‌ల్యాండ్ ప్రావిన్స్‌లలోని మద్యం దుకాణాలు రష్యన్ స్పిరిట్‌లను తీసివేస్తున్నాయి. కెనడాలోని అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్స్ అంటారియో కూడా అన్ని రష్యన్ ఉత్పత్తులను ఉపసంహరించుకోవాలని లిక్కర్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ అంటారియోని ఆదేశించింది. అంటారియోలో 679 దుకాణాల నుంచి రష్యన్‌ మేడ్‌ లిక్కర్‌ను తొలగిస్తున్నారు నిర్వాహకులు. ఇటు ప్రజలు కూడా తమ వద్ద ఉన్న రష్యన్‌ వోడ్కాను పారబ్రోస్తున్నారు.

ప్రపంచంలోనే ఆల్కహాల్ ఇంపోర్ట్‌లో LCBO అతి పెద్ద సంస్థ. కెనెడాలో ఉన్న ఈ సంస్థ… ర‌ష్యన్ వోడ్కాను ఇంపోర్ట్ చేసుకోమ‌ని ప్రక‌టించింది. దీంతో రష్యన్‌ లిక్కర్‌ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతోంది. స్టాటిస్టిక్స్ కెనడా డేటా ప్రకారం, కెనడా 2021లో రష్యా నుంచి దాదాపు 30 కోట్ల విలువైన మద్యాన్ని దిగుమతి చేసుకుంది. ఇప్పుడు ఆ వ్యాపారం అంతా దెబ్బతిననుంది. కెనడియన్లు.. విస్కీ తర్వాత వోడ్కానే ఎక్కువగా తీసుకుంటారు. అందులో రష్యన్‌ వోడ్కానే ఎక్కువగా అమ్ముడవుతుంది. కానీ ఇప్పుడు బ్యాన్‌ విధించడంతో రష్యా లిక్కర్‌ ఇండస్ట్రీకి ఇబ్బందులు ఎదుర్కోనుంది.

రష్యన్‌ లిక్కర్‌ని బ్యాన్‌ చేయడంపై యూఎస్‌, కెనడా దేశస్తులు స్వాగతిస్తున్నారు. వోడ్కాను మాత్రమే కాదు.. ర‌ష్యా నుంచి వ‌చ్చే అన్ని గూడ్స్‌ను అన్ని దేశాల్లో బ్యాన్ చేయాలని.. అప్పుడే ర‌ష్యా తిక్క కుదురుతుంది అంటున్నారు. దీనికి నెటిజన్ల నుంచి కూడా మంచి మద్దతు వస్తోంది.

అమెరికాలోని న్యూ హ్యాంప్‌షేర్‌, ఓహియో రాష్ట్రాలు రష్యాలో తయారైన, రష్యన్‌ బ్రాండ్‌ స్పిరిట్‌లను అమ్మకూడదని నిర్ణయించాయి. ఈ మేరకు హాంప్‌షేర్‌ గవర్నర్‌ క్రిస్‌ సునును, ఓహియో గవర్నర్‌ ప్రకటించారు. రష్యన్‌ స్టాండర్డ్‌ వొడ్కాపై నిషేదం విధిస్తున్నామని ప్రకటించారు. ఓహియోలోని 487 లిక్కర్‌ ఏజెన్సీల్లో రష్యన్‌ మేడ్‌ వొడ్కా బాటిళ్లు 6400 ఉన్నాయని, ఆయా స్టోర్ల నుంచి వాటిని తొలగించాలని ఆదేశించామని గవర్నర్‌ మైక్‌ డివైన్‌ వెల్లడించారు.