Russia-Ukraine war: యుక్రెయిన్‌లోని హాస్పిట‌ళ్లు, అంబులెన్సులు, డాక్ట‌ర్ల‌పై 72 దాడులు : WHO

యుక్రెయిన్‌లోని హాస్పిట‌ళ్లు, అంబులెన్సులు, డాక్ట‌ర్ల‌పై 72 దాడులు జరిగాయి అని WHO వెల్లడించింది.

Russia-Ukraine war: యుక్రెయిన్‌లోని హాస్పిట‌ళ్లు, అంబులెన్సులు, డాక్ట‌ర్ల‌పై 72 దాడులు : WHO

Who Says Attacks On Hospitals Increasing Every Day (1)

Russia-Ukraine war: యుక్రెయిన్ పై రష్యా కోపం ఇంకా చల్లారలేదు. నెల రోజులుగా యుద్ధాన్ని కొనసాగిస్తునే ఉంది. ఈ యుద్ధంలో భాగంగా పలు భవనాలపైనే కాకుండా హాస్పిటల్స్ పై కూడా దాడులు చేస్తోంది. హాస్పిటల్స్ పై పదే పదే దాడులు చేయటాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తంచేసిది. ఆరోగ్య కేంద్రాలపై రష్యా పదే పదే దాడులకు పాల్పడుతోందని..ఇది ఆయునిక యుద్ధంలో వ్యూహాత్మక చర్య అని పేర్కొంది.

రష్యా చేస్తున్న దాడుల్లో భాగంగా హాస్పిటల్స్, డాక్టర్స్, అంబులెన్సులుపై దాడులు చేస్తోందని WHO వెల్లడించింది. దాడుల సంఖ్య రోజువారీగా పెరుగుతున్న‌ట్లు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఫిబ్ర‌వ‌రి 24 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు యుక్రెయిన్‌లో హెల్త్‌కేర్ కేంద్రాల‌పై 72 దాడులు జ‌రిగాయి అని WHO ద్రువీక‌రించింది. ఈ దాడుల్లో సుమారు 71 మంది మృతిచెందార‌ని, 37 మంది గాయ‌ప‌డిన‌ట్లు వెల్ల‌డించింది.
వైమానిక దాడుల వ‌ల్ల హాస్పిట‌ళ్లు ధ్వంసం అయ్యాయ‌ని, మెడిక‌ల్ ట్రాన్స్‌పోర్ట్స్‌, స‌ప్ల‌య్ స్టోర్స్ కూడా దెబ్బ‌తిన్న‌ాయని..కొన్ని సంద‌ర్భాల్లో వైద్య ఆరోగ్య సిబ్బందిని, రోగుల్ని కూడా కిడ్నాప్ చేసిన‌ట్లు తెలుస్తోంది అని వెల్లడించింది.

రోజువారిగా హాస్పిట‌ళ్ల‌ను టార్గెట్ చేస్తున్న ఘ‌ట‌న‌లు పెర‌గ‌డం ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ాయని యుక్రెయిన్ ప్ర‌తినిధి జార్నో హ‌బిచ్ తెలిపారు. డాక్ట‌ర్లు, న‌ర్సుల‌కు ఆరోగ్య కేంద్రాలు సుర‌క్షిత ప్ర‌దేశాలు కావాల‌ని, కానీ ఇలా జ‌ర‌గ‌డం దారుణ‌మ‌ని ఆవేదన వ్యక్తం చేశారు.