Whatsapp : వాట్సాప్‌కు భారీ జరిమానా..!

సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) వాడకం రోజు రోజుకు పెరిగిపోతోంది. దీని వలన దేశ ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండటంతో ఆయా దేశాలు కొత్త చట్టాలు తెస్తున్నాయి. కొత్త చట్టాలకు అనుగుణంగా సోషల్ మీడియా సంస్థలు ఆ దేశంలో కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే భారీ జరిమానా విధిస్తారు. అయితే తాజాగా రష్యా అదే చేసింది.

Whatsapp : వాట్సాప్‌కు భారీ జరిమానా..!

Whatsapp

Whatsapp : సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) వాడకం రోజు రోజుకు పెరిగిపోతోంది. దీని వలన దేశ ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండటంతో ఆయా దేశాలు కొత్త చట్టాలు తెస్తున్నాయి. కొత్త చట్టాలకు అనుగుణంగా సోషల్ మీడియా సంస్థలు ఆ దేశంలో కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే భారీ జరిమానా విధిస్తారు. అయితే తాజాగా రష్యా అదే చేసింది.

ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ వాట్సాప్‌కు రష్యాలో భారీ షాక్‌ ఇచ్చింది. రష్యా దేశ నియమాలను ఉల్లఘించినందుకు ఆ దేశ ప్రభుత్వం సుమారు మూడు మిలియన్ల రూబెల్స్‌ను వాట్సాప్‌పై జరిమానా విధించినట్లు తెలుస్తోంది. రష్యా భూభాగంలో రష్యన్‌ వినియోగదారుల డేటాను స్థానికీకరించడంలో వాట్సాప్‌ విఫలమైంది.

ఈ నేపథ్యంలో వాట్సాప్‌పై చర్యలు తీసుకోవడానికి రష్యా ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ జరిమానాపై ఈ విషయంపై వాట్సాప్‌ స్పందించలేదు. వ్యక్తిగత డేటా చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను రష్యన్‌ కోర్టు గత కొద్దీ రోజుల్లోనే ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఆల్ఫాబెట్‌పై జరిమానా విధించింది. తాజాగా ఆల్ఫాబెట్‌ కు మూడు మిలియన్ రూబెల్స్‌ జరిమానా వేసిన రష్యా కోర్టు.