Saif al-Adel: సైఫ్ అల్ అదేల్ ఎవరు? అల్‌ఖైదా నెక్ట్స్ చీఫ్ అతనేనా?

అల్‌ఖైదా చీఫ్ ఐమన్ అల్ జవహరిని అమెరికా మట్టుబెట్టింది. దీంతో ప్రస్తుతం ఆల్ ఖైదా చీఫ్ ఎవరు అనే ప్రశ్న ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆల్ ఖైదా చీఫ్ కు పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.

Saif al-Adel: సైఫ్ అల్ అదేల్ ఎవరు? అల్‌ఖైదా నెక్ట్స్ చీఫ్ అతనేనా?

Saif al-Adel : అల్‌ఖైదా చీఫ్ ఐమన్ అల్ జవహరిని అమెరికా మట్టుబెట్టింది. ఆఫ్ఘనిస్థాన్ లోని కాబూల్ లో డ్రోన్‌ల ద్వారా దాడులు నిర్వహించి హతమార్చింది. 2011లో ఒసామా బిన్ లాడెన్ మరణం తరువాత జవహరీ ఆల్ ఖైదా చీఫ్ గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం అమెరికా నిర్వహించిన ఆపరేషన్ లో జవహరి హతమయ్యాడు. దీంతో ప్రస్తుతం ఆల్ ఖైదా చీఫ్ ఎవరు అనే ప్రశ్న ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆల్ ఖైదా చీఫ్ కు పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.

Al-Zawahiri: అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరీ హతం.. మట్టుపెట్టిన అమెరికా

సీనియారిటీ ప్రకారం తరువాతి స్థానంలో.. సైఫ్ అల్-అదెల్, అబ్దల్-రహమాన్, AQIMలో అల్-ఖైదాకు చెందిన యాజిద్ మెబ్రాక్, అల్-షబాబ్‌కు చెందిన అహ్మద్ దిరియే ఉన్నారు. అయితే వీరిటిలో ఎవరు ఆల్ ఖైదా చీఫ్ బాధ్యతలు తీసుకుంటారనే అంశంపై స్పష్టత రాలేదు.  అనుభవజ్ఞుడైన అల్-ఖైదా సభ్యుడు సైఫ్ అల్-అదేల్ చీఫ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. FBI (Federal Bureau of Investigation) రికార్డుల ప్రకారం.. అదేల్ ఏప్రిల్ 11న జన్మించాడు. అయితే అతని పుట్టిన సంవత్సరం 1960 లేదా 1963 మధ్యలో ఉంటుంది. జవహిరి లాగానే అదేల్ కూడా ఈజిప్టు పౌరుడు. ఈజిప్ట్ సైన్యంలో పనిచేసి కల్నల్ స్థాయికి ఎదిగాడు.

Al-Qaeda Chief Killed: సర్జన్ నుంచి ఆల్‌ఖైదా చీఫ్‌గా అల్ జవహరీ.. ఈజిప్టు సైన్యంలోనూ పనిచేశాడు

గతంలో జవహరీ స్థాపించిన ఈజిప్షియన్ ఇస్లామిక్ జీహాద్ (EIJ)తో అనుబంధం కలిగి ఉన్నాడు. అంతేకాక అదేల్ పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడిగా నమ్ముతారు. అదేల్ ను FBI ‘మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్’గా యూఎస్ ప్రకటించింది. అమెరికన్లను చంపడానికి కుట్ర పన్నారని, యూఎస్ కు చెందిన ఆస్తులు, భవనాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని, యునైటెడ్ స్టేట్స్ యొక్క నేషనల్ డిఫెన్స్ యుటిలిటీలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని FBI ఏజెన్సీ ఆరోపించింది. అక్టోబరు 1993లో సోమాలియాలోని మొగదిషులో18 మంది US సైనికుల మరణానికి దారితీసిన అపఖ్యాతి పాలైన ‘బ్లాక్ హాక్ డౌన్’ సంఘటనలో అదేల్ పాత్ర కీలకమని ఎఫ్‌బిఐ పేర్కొంది. అయితే ప్రస్తుతం ఆల్ ఖైదా తరువాతి చీఫ్ గా అతనే ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.