Al-Qaeda Chief Killed: సర్జన్ నుంచి ఆల్‌ఖైదా చీఫ్‌గా అల్ జవహరీ.. ఈజిప్టు సైన్యంలోనూ పనిచేశాడు

ఆల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీని అమెరికా బలగాలు మట్టుపెట్టాయి. ఈజిప్టు భారతీయుడైన అల్ జవహరీ ఆ దేశ సైన్యంలో సర్జన్ గా పనిచేశాడు. తరువాతి కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో లాడెన్ కు సన్నిహితుడుగా మారి.. లాడెన్ మరణం తరువాత ఆల్‌ఖైదా చీఫ్‌గా కొనసాగాడు..

Al-Qaeda Chief Killed: సర్జన్ నుంచి ఆల్‌ఖైదా చీఫ్‌గా అల్ జవహరీ.. ఈజిప్టు సైన్యంలోనూ పనిచేశాడు

Updated On : August 2, 2022 / 9:45 AM IST

Al-Qaeda Chief Killed: ఆల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీని అమెరికా బలగాలు మట్టుపెట్టాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్‌లో జరిగిన డ్రోన్ దాడిలో జవహరీని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు. ఆపరేషన్ సమయంలో ఉగ్రవాది కుటుంబ సభ్యులెవరూ గాయపడలేదని బిడెన్ తెలిపాడు. జవహరీ విద్యావంతుడు. 71ఏళ్ల ఈజిప్టు భారతీయుడు. సర్జన్ గా తన వృత్తిని ప్రారంభించి అల్‌ఖైతా చీఫ్‌గా మారాడు. 2011 సంవత్సరంలో పాకిస్థాన్ లో యూఎస్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ లో అప్పటి అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ హతమయ్యాడు. ఆ తరువాత అల్‌ఖైదా చీఫ్ గా అల్ జవహరీ కొనసాగుతూ వచ్చారు.

Al-Zawahiri: అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరీ హతం.. మట్టుపెట్టిన అమెరికా

ఈజిప్టు భారతీయుడైన ఐమన్ అల్ జవహరీ 19 జూన్ 1951 న ఆప్రికన్ దేశంలోని గిజాలో జన్మించాడు. బిన్ లాడెన్ లాగానే జవహరీ కూడా బిజినెస్ అండ్ ఎకనామిక్స్ అడ్మినిస్ట్రేషన్ ను అభ్యసించాడు. పలు నివేదికల ప్రకారం.. సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ కూడా పొందాడు. అతని కుమారుడు కూడా ఉన్నత విద్యావంతుడే. 71ఏళ్ల జవహరీ ఈజిప్టు సైన్యంలో సర్జన్ గా మూడేళ్లపాటు పనిచేశాడు. ఈజిప్ట్ అధ్యక్షుడు హత్య సమయంలో మిలిటెంట్ ఇస్లాంలో ప్రమేయం ఉందన్న కారణంగా 1980లో ఈ ఈజిప్ట్ వైద్యుడిని అరెస్ట్ చేశారు. మూడేళ్లుపాటు జలహరీ జైలు జీవితం గడిపాడు. విడుదలైన తరువాత ఆ దేశాన్ని విడిచిపెట్టి అంతర్జాతీయ జిహాదిస్ట్ ఉద్యమాల్లో కీలక భూమిక పోషించాడు.

China: చైనా నుంచి ముప్పు.. భారీ యుద్ధ విన్యాసాలు చేప‌ట్టిన తైవాన్

అల్-జవహిరి ఈజిప్షియన్ ఇస్లామిక్ జిహాద్ (EIJ)ని స్థాపించాడు. ఈ సమయంలోనే ఆఫ్గనిస్థాన్ లో స్థిరపడి ఒసామా బిన్ లాడెన్ కు అత్యంత సన్నిహితుడయ్యాడు. 1998లో ఇస్లామిక్ జిహాద్ ను అల్-ఖైదాతో విలీనం చేశాడు. అల్ జవహరీ ఆగస్టు 1998లో దార్ ఎస్ సలామ్ (టాంజానియా), నైరోబీ (కెన్యా)లోని యూఎస్ రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడుల్లో పాల్గొన్నాడు. ఆ తరువాత లాడెన్ తో కలిసి అమెరికాపై యుద్ధాన్ని ప్రకటించాడు. 9/11 దాడులు, ఒసామా బిన్ లాడెన్ చేపట్టిన ఇతరత్రా దాడుల్లో అల్ జవహరీ కీలకంగా ఉండేవాడు. అమెరికా సైన్యం లాడెన్ ను మట్టుబెట్టిన తరువాత అల్ ఖైదా చీఫ్ గా కొనసాగుతూ వచ్చాడు. అయితే అమెరికా జవహరీని మట్టుపెట్టేందుకు అనేక దఫాలుగా ప్రయత్నించింది. చివరకు ఆప్ఘనిస్థాన్ లో శనివారం అమెరికా సైన్యం జరిపిన ఆపరేషన్ లో జవహరీ హతమయ్యాడు.