ఆ కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, శాశ్వతంగా ఇంటి నుంచే వర్క్, మూడు ఆఫ్షన్లు..

ఆ కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, శాశ్వతంగా ఇంటి నుంచే వర్క్, మూడు ఆఫ్షన్లు..

Salesforce working from home forever : కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. వర్క్ విషయంలో మూడు ఆప్షన్లు ముందుంచింది. అందులో..ప్రధానంగా.శాశ్వతంగా ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చనే ఆప్షన్ ఉండడం హాట్ టాపిక్ అయ్యింది. తమ ఉద్యోగుల బాగు కోసమే…కొత్త పని మార్గాలను అందించాలని నిర్ణయించినట్లు సంస్థ స్పష్టం చేసింది. ఇది..ప్రముఖ క్లౌడ్ ఆధారిత..సాఫ్ట్ వేర్ సంస్థ సేల్స్ ఫోర్స్ (Salesforce) నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రం ఎనీ వేర్ అనే నూతన విధానాన్ని అందుబాటులోకి తెస్తూ..మార్గదర్శకాలను విడుదల చేసింది.

మూడు వారాల్లో పని చేయడానికి వెసులుబాటు కల్పించింది. ఫ్లెక్స్ (flex), ఫుల్లీ రిమోట్ (fully remote), కార్యాలయ ఆధారిత పని (work in the office) విధానం అనే మూడు ఆప్షన్లు ఇచ్చింది. ‘ఫ్లెక్స్’ ఆప్షన్ కింద పనిచేసే ఉద్యోగులు టీమ్ కొలాబరేషన్, కస్టమర్ మీటింగ్స్, ప్రజెంటేషన్స్ వంటి వాటి కోసం ప్రతివారం ఒకటి నుంచి మూడు రోజులు కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. ఇతర ఉద్యోగులు పూర్తిగా రిమోట్ గానే పనిచేస్తారని స్పష్టం చేసింది. ఈ ఆప్షన్ ను ఎంచుకున్న ఉద్యోగులు భౌతికంగా..ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 49 వేల మంది వారంలో నాలుగైదు రోజులు ఆఫీసులో వర్క్ చేస్తారని తెలిపింది. సేల్స్ ఫోర్స్ లో 9 నుంచి 5 జాబ్ కు స్వస్తి పలికినట్లు, ఉద్యోగులు తమకు అనువైన విధానంలో, అనువైన సమయంలో పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు సేల్స్​ఫోర్స్ చీఫ్​ ప్రెసిడెంట్​ బ్రెంట్ హైదర్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ వంటి నగరాల్లో ఉన్న ఆఫీసుల్లో కూడా ఈ విధానం అమల్లో ఉంటుందని తెలిపింది.

9 టూ 5 పని సంస్కృతి చచ్చిపోయింది. మంచి ఉద్యోగ వాతావరణం అంటే కార్యాలయంలో ఆటలు, తినుబండారాలు నిత్యం అందుబాటులో ఉండటం కాదు’ అని కంపెనీ ప్రెసిడెంట్ బ్రెంట్ హైడర్ ఉద్యోగులను ఉద్దేశించి ఓ బ్లాగులో రాశారు.

ఇక సేల్స్ ఫోర్స్ కు విషయానికి వస్తే..అమెరికాలో మొత్తం 19 కార్యాలయాలున్నాయి. వీటిలో శాన్ ఫ్రాన్సిస్కో లో 1,070 అడుగుల ఎత్తైన టవర్ నిర్మించింది. దీనిని నిర్మించడానికి 1.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఈ ఆఫీసు నుంచి ఎప్పుడు కార్యకలాపాలు మొదలవుతాయని వెల్లడించలేదు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తమ కంపెనీ పలు చర్యలు తీసుకొంటోందని, ఆఫీసు బిల్డింగ్ లోకి ప్రవేశించే ముందు..టెంపరేచర్ స్క్రీనింగ్ లు, ఫేస్ కవరింగ్, డీప్ క్లీనింగ్, మాన్యువల్ కాంటాక్ట్ ట్రేసింగ్ అమలు చేయనున్నట్లు తెలిపింది. మొదట్లో 2021 ఆగస్టు వరకు ‘వర్క్​ ఫ్రం హోం’ విధానంలో పనిచేయవచ్చని తెలిపింది. కానీ, అనేక మార్పులు రావడంతో…పలు కంపెనీలు ఆఫీసుల్లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తుండటం, ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్​ పంపిణీ వేగవంతం కావడం వంటి కారణాలతో​ ఆఫీసు నుంచి తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని సేల్స్​ఫోర్స్​ యోచిస్తోంది.